ఈవారం మొత్తం సినిమాలే సినిమాలు

గత రెండు వారాలుగా మూవీ లవర్స్ కి సరైన సినిమా లేకపోవడంతో.. వారానికి కనీసం నాలుగైదు సినిమాలు చూసే అలవాటున్నవాళ్ళందరూ బోర్ ఫీలయ్యారు. దాంతో ఈ వీకెండ్ గురువారం నుంచే మొదలుకానున్న సినిమాల సందడి వాళ్లందరికీ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. రేపు (మార్చి 21) ఒక స్ట్రయిట్ తెలుగు సినిమా “చీకటి గదిలో చితక్కొట్టుడు”, ఒక తెలుగు డబ్బింగ్ సినిమా “పులిజూదం” విడుదలవుతుండగా.. “కేసరి, మర్ద్ కో దర్డ్ నహీ హోతా” అనే రెండు హిందీ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. వీటితోపాటు “హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 3” కూడా విడుదలవుతోంది. ఇక శుక్రవారం “వినరా సోదర వీర కుమారా” అనే చిన్న సినిమా విడుదలవుతోంది.

అన్నీ సినిమాల మీద దాదాపుగా మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కో సినిమా ఒక్కో జోనర్ ది కావడమే కాక అన్నీ డిఫరెంట్ సినిమాలే కావడంతో సినిమా లవర్స్ అందరూ ఈ వీకెండ్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మరి వాళ్లందరికీ ఈ వీకెండ్ సినిమాలు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తాయో చూడాలి.

Share.