మైఖేల్ మదన్ కామరాజు గ్రేట్ ఎంట్రీ

మహాతల్లి, గీతా సుబ్రమణ్యం వంటి అత్యంత వినోదాత్మక వెబ్ సిరీస్ లను అందించిన wirally Originals సరికొత్త వెబ్ సిరీస్ ను తీసుకొచ్చింది. మైఖేల్, మదన్, కామరాజు అనే పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ తొలి ఎపిసోడ్ ఈరోజు రిలీజ్ అయి యువతని ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు చాల మంచి లఘుచిత్రాలతో అలరించిన డైరక్టర్ అభిరామ్ దీనిని మరింత ఇంట్రెస్టింగ్ గా మలిచారు.

మైఖేల్, మదన్, కామరాజు గురించి మొదటి ఎపిసోడ్ లోనే హాస్యాన్ని జోడించి స్పష్టంగా వివరించారు. మైఖేల్, మదన్, కామరాజులుగా నవీన్, శైలేష్, అంకార్ లు చక్కగా నటించి వెబ్ సిరీస్ పై ఆసక్తిని పెంచారు. గీతసుబ్రహ్మణ్యం తర్వాత Tamada Media నిర్మించిన మైఖేల్, మదన్, కామరాజు ప్రతి శుక్రవారం రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.