మేఘ ఆకాష్ కి మరో మంచి అవకాశం వచ్చింది

సెంటిమెంట్స్ కి భీభత్సమైన వేల్యూ ఇచ్చే మన ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కి ఫ్లాప్ వచ్చిందంటే ఆమెను ఫ్లాప్ హీరోయిన్ అని, ఐరన్ లెగ్ అనీ ముద్ర వేసేసి ఆమెకు అవకాశాలు రాకుండా చేయడంలో మన తెలుగు ఇండస్ట్రీ అనే కాదు తమిళ ఇండస్ట్రీ కూడా ముందు ఉంటుంది. అలాంటిది.. కెరీర్ మొత్తంలో ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేని మేఘా ఆకాష్ మాత్రం రిజల్ట్ తో సంబంధం వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. “లై, చల్ మోహన్ రంగ” లాంటి ఫ్లాపుల తర్వాత కూడా మేఘా ఆకాష్ కు తెలుగులో మరో అవకాశం దక్కింది.

రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఇటీవల ప్రారంభమమైన “ఇద్దరి లోకం ఒకటే” చిత్రంలో రాజ్ తరుణ్ సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది మేఘ ఆకాష్. జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హీరో రాజ్ తరుణ్ కి చాలా కీలకం. అలాంటిది.. కెరీర్ మొత్తంలో ఒక్క హిట్ కూడా లేని మేఘ ఆకాష్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేయడం దిల్ రాజు కాన్ఫిడెన్సా లేక దర్శకుడి రిక్వెస్టా అనేది తెలియాలి. మరి ఈ ఫ్లాప్ హీరో & హీరోయిన్ కాంబోతో దిల్ రాజు హిట్ కొడతాడో లేదో చూడాలి.

Share.