`ఎంసీఏ`మూవీ టైటిల్ సాంగ్ | నాని, సాయి పల్లవి

డ‌బుల్ హ్యాట్రిక్ హీరో నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్నసినిమా `ఎంసీఏ`. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. న‌వంబ‌ర్ మొద‌టి వారానికి రెండు సాంగ్స్ మిన‌హా మొత్త చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న సినిమా ఇది. నానికి జంట‌గా ఇటీవ‌ల `ఫిదా`తో తెలుగువారి మ‌న‌సుల్ని దోచుకున్న సాయిప‌ల్ల‌వి నటిస్తుంది. శ‌్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్‌రాజు మాట్లాడుతూ – “మా వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ ఏడాది రూపొందిన శ‌త‌మానంభ‌వ‌తి, నేను లోక‌ల్‌, డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్, ఫిదా, రాజా ధి గ్రేట్ చిత్రాల‌తో వ‌రుస‌గా ఐదు హిట్స్ సాధించాం. ఇప్పుడు నాని హీరోగా నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం `ఎంసిఏ`. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న `ఎంసిఎ` చిత్రం మా బ్యాన‌ర్‌లో మ‌రో హిట్ చిత్రంగా నిలవ‌డ‌మే కాకుండా మా బ్యాన‌ర్‌లో సెకండ్ హ్యాట్రిక్ మూవీ అవుతుంది. అద్భుత‌మైన క‌థ‌, అన్నీ స‌మ‌పాళ్ళ‌లోన ఎలిమెంట్స్‌తో ఈ చిత్రంలో నానిని ద‌ర్శ‌కుడు వేణు స‌రికొత్త స్ట‌యిల్లో చూపించ‌నున్నారు. మా బ్యాన‌ర్లో సెన్సేష‌న‌ల్ హిట్ అయిన మూవీ ఫిదాలో న‌టించిన సాయిప‌ల్ల‌వి నానికి జోడిగా న‌టిస్తుండ‌గా, ప్ర‌ముఖ హీరోయిన్ భూమిక ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

Share.