మన్మధుడు 2 రిలీజ్ డేట్ సస్పెన్స్ కి రేపే క్లారిటీ

ఈమధ్య సినిమాలను జనాల మధ్య కంటే సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు సెలబ్రిటీలు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఒరవడికి నాంది పలికింది విజయ్ దేవరకొండ-రష్మిక మండన్నలు. “గీత గోవిందం” ప్రమోషన్స్ కోసం వాళ్ళు సోషల్ మీడియాలో చేసిన రచ్చ మామూలుది కాదు. ఇప్పుడు ఇదే ఫార్మాట్ ను కింగ్ నాగార్జున కూడా ఫాలో అవుతున్నాడు. సింపుల్ గా ఇదీ విడుదల తేదీ అని ప్రకటించకుండా ఇవాళ ట్విట్టర్ లో “ఏమయ్యా రాహుల్ నా సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తావ్?” అని దర్శకుడు రాహుల్ రవీందర్ ను ప్రశ్నించగా.. దానికీ సమాధానంగా రాహుల్ రవీందర్ ట్విట్టర్ లోనే “ఆ సీక్రెట్ రేపు టీజర్ లో తెలుస్తుంది, మీకు మంచి సర్ ప్రైజ్ అది” అని సమాధానం ఇచ్చాడు.

nagarjuna-asks-rahul-ravindran-about-manmadhudu2-movie-release-date1

nagarjuna-asks-rahul-ravindran-about-manmadhudu2-movie-release-date2

బేసిగ్గా ఇదంతా సినిమా రిలీజ్ డేట్ రేపు టీజర్ లో రివీల్ అవుతుంది అని జనాలకు చెప్పడం కోసం చేసిన పనే. కానీ.. కాస్త ఇన్నోవేటివ్ గా చేస్తున్నారంతే. సో, రేపు సాహో టీజర్ విడుదల అనంతరం మద్యాహ్నం విడుదలవుతున్న “మన్మధుడు 2” టీజర్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయే “మన్మధుడు”కి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమా కాబట్టి ప్రేక్షకులందరికీ భారీ అంచనాలున్నాయి.

Share.