మన్మధుడు 2 టీజర్ లో రకుల్ కనిపించలేదని బాధపడిన ఫ్యాన్స్ కోసం

2002లో విడుదలై క్లాసిక్ హిట్ గా నిలిచిన నాగార్జున‌ నటించిన “మన్మధుడు” చిత్రానికి దాదాపు 17 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ “మన్మధుడు 2”, నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ చిత్రం టీజ‌ర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్‌లో నాగార్జున రోల్ కి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, ఆయనకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేశారు. అయితే ఈ టీజర్‌లో రకుల్ కనిపించకపోవడంపై అందరిలో సందేహాలు తలెత్తాయి. ముఖ్యంగా రకుల్ ఫ్యాన్స్ చాలా గోల చేశారు.

అయితే.. ఆమెకి సంబంధించిన సన్నివేశాలపై ప్రత్యేకంగా మరో టీజర్ ను వదులుతామనీ, అందుకే తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో రకుల్ ను చూపించలేదని రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశాడు. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయ‌నున్నారు. కీర్తి సురేష్, సమంత ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

Share.