పూరి సినిమాలో మందిరా బేడి..?

బాలీవుడ్ నటి మందిరా బేడి చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి క్రేజ్ సంపాందిచుకుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్‌ మీడియాలో తన హాట్ ఫోటోలు, వీడియోలతోనే మరింత పేరుతెచ్చుకుంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సాహో’ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ నటి. ఇప్పుడు మరో చిత్రంలో కూడా నటించడానికి రెడీ అయ్యింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ రూపొందిస్తున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో కనిపించబోతుందా లేక ఆకాష్ పూరీ …హీరోగా చేస్తున్న ‘రొమాంటిక్‌’ లో నటించబోతుందా అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం పూరీ రూపొందిస్తున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ‘రొమాంటిక్‌’ చిత్రాలు గోవా లోనే షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అండ్‌ ‘రొమాంటిక్‌’ టీమ్స్‌ కలిసి సందడి చేస్తున్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో మందిరాబేడీ కూడా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఆంధ్రాపోరి’ చిత్రంతో హీరోగా పరిచయమయిన ఆకాష్ పూరి… తరువాత తన తండ్రి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘మెహబూబా’ చిత్రంతో పూర్తిస్థాయి హీరోగా మారాడు. అయితే ఈ రెండు చిత్రాలు ఆకాష్‌కు హిట్ ఇవ్వలేదు… దీంతో మూడో చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక తన తండ్రి కూడా ప్లాపుల్లోనే ఉన్నాడు. మరి ఈ సంవత్సరం తండ్రి, కొడుకులు హిట్టిస్తారేమో చూడాలి.

Share.