తండ్రి పుట్టినరోజు సందర్బంగా… ఓ బాలికను దత్తత తీసుకున్న మంచు మనోజ్..!

కలెక్షన్ కింగ్… డైలాగ్ కింగ్ అయిన మంచు మోహన్ బాబు ఈరోజున తన 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయన చిన కుమారుడు మంచు మనోజ్ ఓ బాలికను దత్తత తీసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరూ ‘మనోజ్ ఈజ్ గ్రేట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎప్పుడూ తన ప్రతీ అప్డేట్ ను తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు పంచుకుంటూ ఉంటూ ఉండే మనోజ్… ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

manchu-manoj-adopts-a-baby-girl1

మనోజ్ ఈ విషయం పై స్పందిస్తూ… “నాన్న పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి పని చేయాలనుకున్నాను. ఇందులో భాగంగా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ అమ్మాయిని విద్యానికేతన్ స్కూల్ లో జాయిన్ చేశాను, ఇకనుండీ తన భాద్యతలన్నీ కూడా నేనే తీసుకుంటాను. మంచి చదువు చెప్పిస్తాను, జాగ్రత్తగా చూసుకుంటాను. ఐఏఎస్ అధికారి అవ్వాలనేది ఆ పాప ఆశయం, తను అనుకున్నది సాధించే వరకూ సాయపడతాను” అంటూ పేర్కొన్నాడు మనోజ్. దానికి ‘జాయ్ ఆఫ్ గివింగ్’ అంటూ హ్యాష్ ట్యాగ్ ను జతచేసి ‘ఎన్నో మంచి పనులు చేయడానికి మా నాన్నే నాకు స్ఫూర్తి… నా ప్రాణమైన మా నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ తన ట్వీట్ ను రీట్వీట్ చేసాడు.

Share.