మహేష్ ‘మహర్షి’ లేటెస్ట్ అప్డేట్..!

మహేష్ బాబు 25 వ చిత్రంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మే 9న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్లను ఇప్పటికే మొదలు పెట్టేసింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎప్పుడు నిర్వహిస్తారా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సంబందించిన అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

మే 1న హైదరాబాద్ శిల్పకళా వేదికలో ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారట. మహేష్ బాబుకి ఇది 25వ చిత్రం కావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పరంగా కూడా ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. ఈ చిత్రానికి ముందు వచ్చిన మహేష్ 24 చిత్రాలకి సంబంధించిన దర్శకులను ఈ వేడుకకి ఆహ్వానిస్తున్నారట. అందుబాటులో లేని కొందరి దర్శక నిర్మాతలు.. వారి మనసులో మాటలను చెప్పే వీడియోను కూడా ఈ వేదిక పై ప్లే చేయబోతున్నారట. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్ ను ఆహ్వానించబోతున్నారని తెలుస్తుంది. మహేష్ బాబు కి వెంకటేష్ తో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో కూడా నటించారు.

Share.