ట్రెండ్ సృష్టించిన మహేష్ హెయిర్ స్టైల్స్

మహేష్ బాబు పేరు చెప్పగానే.. అందరికి మొదట వచ్చే మాట అందగాడు అని. ఆ హ్యాడ్సమ్ లుక్ తో నటించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా చిత్ర సీమలోకి ప్రవేశించిన మహేష్ బాబు సినిమాకి సినిమాకి కొత్త లుక్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రిన్స్ హెయిర్ స్టైల్స్ ట్రెండ్ సృష్టించాయి. అతనికి యూత్ ఐకాన్ అనే పేరుని తీసుకొచ్చాయి. యువతను విపరీతంగా ఆకర్షించిన మహేష్ హెయిర్ స్టైల్స్ పై ఫోకస్..

చైల్డిష్ లుక్Mahesh Babuరాజకుమారుడుతో హీరోగా పరిచయమైన మహేష్ మొదట్లో క్లీన్ షేవ్ తో చాకోలెట్ బాయ్ లా ఉండేవాడు. అప్పట్లో బాబీలో అతను కనిపించిన లుక్ తొలి సారి ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమా ఫెయిల్ అయినప్పటికీ అందులోని చైల్డిష్ లుక్ హెయిర్ స్టైల్ యువతను ఆకట్టుకుంది.

షార్ట్ హెయిర్ కట్ Mahesh Babuమహేష్ నటుడిగా నిరూపించిన చిత్రం నిజం. ఇందులో ప్రిన్స్ మేకప్ ఏమి లేకుండా పక్కింటి అబ్బాయిలా కనిపించారు. ముఖ్యంగా షార్ట్ హెయిర్ కట్ కాలేజీ అబ్బాయిలు చాలా మంది ఫాలో అయ్యారు.

షార్ట్ క్రూ కట్ Mahesh Babuమహేష్ క్రేజ్ ని అమాంతం పెంచిన మూవీ అతడు. ఇందులో గ్యాంగ్ స్టర్ గా నటించి మెప్పించారు. అసలు ఒక స్టార్ హీరో కనిపించడానికి ఇష్టపడని షార్ట్ క్రూ కట్ చేయించుకొని ప్రిన్స్ ట్రెండ్ సృష్టించారు.

లాంగ్ హెయిర్ Mahesh Babuఒక పోకిరి ఎలా ఉంటాడు.. జుట్టు పెంచి చాలా రఫ్ గా ఉంటాడు. పోకిరి సినిమాలో అచ్చు అలాగే ఉంటారు మహేష్. ఆయన అభిమానులకు ఈ సినిమా కంటే అందులోని మహేష్ హెయిర్ స్టైల్ భలే నచ్చింది. సినిమా ఇండస్ట్రీ హిట్ కావడానికి మహేష్ లుక్ కూడా కారణం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

పంక్ హెయిర్ స్టైల్ Mahesh Babuసైనికుడు సినిమాలో మహేష్ స్టూడెంట్ గా నటించారు. అందుకు తగ్గట్లుగానే వెనుక జుట్టు బాగా పెంచి, పంక్ హెయిర్ స్టైల్ తో కూల్ గా కనిపించారు.

లాంగ్ హెయిర్ విత్ కలర్ Mahesh Babuఅతిధి సినిమాలో మహేష్ కొత్తగా ఉంటారు. కలర్ వేసుకున్న పొడవాటి జుట్టుతో హాలీవుడ్ స్టార్ లా మెరిసిపోయారు.

స్పైక్స్ Mahesh Babuఖలేజా లో మహేష్ క్యాబ్ డ్రైవర్ గా నటించినప్పటికీ స్టైల్లో ఏ మాత్రం తగ్గలేదు. బజ్ కట్ లో స్పైక్స్ లుక్ తో హ్యాండ్ సమ్ హీరో అని నిరూపించుకున్నారు.

చిక్ అర్బన్ హెయిర్ కట్ Mahesh Babuపవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా దూకుడులో మహేష్ కిరాక్ పుట్టించారు. ఇందులో ప్రిన్స్ హెయిర్ స్టైల్ భిన్నంగా ఉంటుంది. సిటీ కుర్రోళ్ళు అమితంగా ఇష్టపడే చిక్ అర్బన్ హెయిర్ కట్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

కంబెడ్ అప్ కట్ Mahesh Babuరాక్ స్టార్ గా మహేష్ నటించిన సినిమా నేనొక్కడినే. ఆ పాత్రకు తగినట్లుగా సిక్స్ ప్యాక్ బాడీతో పాటు రాక్ స్టార్స్ చేయించుకునే కంబెడ్ అప్ కట్ చేయించుకొని కిరాక్ పుట్టించారు.

లైట్ బ్రష్ కట్ Mahesh Babuశ్రీమంతుడు మూవీలో మహేష్ సరికొత్తగా కనిపించారు. ఇందుకు కారణం హెయిర్ కట్. సాధారణ హెయిర్ కట్ కి లైట్ గా బ్రష్ కట్ డిఫెరెంట్ లుక్ ని తీసుకొచ్చారు. ఈ స్టైల్ మహేష్ అందాన్ని మరింత పెంచింది.

Share.