ప్రిన్స్ క్రేజ్ ను వాడుకుంటున్న మెగా ప్రిన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సునీల్ నారంగ్ తో కలిసి ‘ఎఎంబీ సినిమాస్’ సూపర్ ప్లెక్స్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2 న లాంఛనంగా ప్రారంభించిన ఈ సూపర్ ప్లెక్స్ మంచి రిచ్ లుక్ తో రూపొందింది. ఇక ‘ఎఎంబీ సినిమాస్’ ను ఒక వేడుకగా ఉపయోగించుకునేందుకు కొన్ని చిత్ర యూనిట్లు భావిస్తున్నాయట.ఇందులో భాగంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అంతరిక్షం 9000 kmph’ .

‘ఘాజి’ వంటి సూపర్ హిట్ ను సాధించిన సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందింది. ఇక ‘అంతరిక్షం 9000 kmph’ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకను ‘ఎఎంబీ సినిమాస్’ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. డిసెంబర్ 9 న ఉదయం 11 గంటలకు చిత్ర నటీనటులతో ఈ కార్యక్రమం జరుగబోతోంది. స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘అంతరిక్షం’ చిత్రాన్ని ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మిస్తుండగా అదితి రావు హైదరీ, లావణ్య త్రిపాఠి లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.

Share.