మహేష్ బాబు వదులుకున్న సినిమాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రిస్క్ ఎక్కువ ఉన్నప్పటికీ విభిన్న కథలను చేయడానికి ఇష్టపడుతారు. విజయం సాధిస్తుందని తెలిసినప్పటికీ తనకి ఇష్టంలేని కథలను చేయరు. అలా మహేష్ వదులుకున్న సినిమాలపై ఫోకస్..

మనసంతా నువ్వే 1-manasantha-nuvveఉదయ్ కిరణ్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం మనసంతా నువ్వే. ఈ కథ మొదట మహేష్ వద్దకే వచ్చింది. మంచి ప్రేమ కథ అయినప్పటికీ రిజెక్ట్ చేశారు.

ఏ మాయ చేసావే 2-ye-maaya-chesaveగౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఆణిముత్యం ఏ మాయ చేసావే. నాగ చైతన్య, సమంత లకు ఈ చిత్రం కెరీర్ పరంగా, రియల్ లైఫ్ పరంగా మరుపురానిదిగా నిలిచింది. ఎందుకో గానీ ఈ సినిమాని మహేష్ చేయనున్నారు.

రుద్రమదేవి 3-rudramadeviగుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నా రెడ్డి పాత్ర ప్రత్యేకమైంది. ఈ పాత్రలో నటించమని డైరక్టర్ మొదట మహేష్ ని అడిగారు. కానీ ఆ పాత్రను చేయడానికి ఆసక్తి చూపించలేదు. అల్లు అర్జున్ కి ఈ రోల్ అవార్డులను తెచ్చి పెట్టింది.

24 4-24-movieసూర్య త్రి పాత్రాభినయం చేసిన సినిమా 24 . హీరోగా విలన్ గా అద్భుతంగా నటించి హిట్ అందుకున్నారు. ఈ స్టోరీని విక్రమ్ కుమార్ తొలుత మహేష్ కి వినిపించారు. బాగా నచ్చినప్పటికీ విలన్ రోల్ చేయడం ఇష్టం లేక వదులుకున్నారు.

అ .. ఆ5-a-aa-movieకృష్ణ చేసిన కుటుంబ కథ చిత్రం “మీనా” కి మార్పులు చేసి త్రివిక్రమ్ అ .. ఆ సినిమా చేశారు. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. త్రివిక్రమ్ ఈ సినిమాలో హీరోగా మహేష్ అని అనుకున్నారు. అతను వద్దనే సరికి నితిన్ కి వెళ్ళింది.

ఫిదా 6-fidaa-movieశేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీలో డైరక్టర్ ఫస్ట్ అనుకున్న హీరో మహేష్. ఈ కథ మహేష్ కి నచ్చి కొన్ని రోజులు తన దగ్గర పెట్టుకున్నారు కూడా. కానీ ఎటువంటి అంచనాలు లేకున్నా హీరో అయితే బాగుంటుందని భావించి చేయనున్నారు. వరుణ్ తేజ్ హిట్ ని సొంతం చేసుకున్నారు.

దీంతో మహేష్ నో అంటే ఆ కథ హిట్ అవుతుందనే నమ్మకం టాలీవుడ్ లో బలపడింది.

Share.