క్రిష్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చింది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. డైరెక్టర్ సుకుమార్ కూడా మహేష్ తో చేసే సినిమా పనిలోనే బిజీ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలా సుకుమార్ సినిమా లైన్ లో ఉండగానే మరొక సినిమా కి కూడా మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబు డేట్స్ కోసం చాలా మంది డైరెక్టర్ లు వెయిట్ చేస్తున్నారు. అయితే అల్లు అరవింద్ నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఉండబోతుందట. ఇదివరకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ పేరు వినిపించినప్పటికీ ఆ ప్లేస్ లో డైరెక్టర్ క్రిష్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ మరియు బాలీవుడ్ లో ఒక సినిమా తీస్తూ ఉండగా, మహేష్ తో సినిమా చేసే బాధ్యతలను అల్లు అరవింద్ క్రిష్ కి అప్పగించినట్లు సమాచారం. ఇక వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందనేది త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Share.