క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారిని కలిసి దైర్యం చెప్పిన మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమా అయిన ‘మహర్షి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్దమవుతున్నాడు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం మే 9 న విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా మహేష్ అప్పుడప్పుడు కొన్ని సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. మహేష్ సతీమణి నమ్రత… ఈ పనులన్నిటినీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తాజగా మహేష్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారిని కలిసాడు.

mahesh-babu-venkatesh-meeted-his-cancer-fans1

mahesh-babu-venkatesh-meeted-his-cancer-fans2

శ్రీకాకుళానికి చెందిన పర్వీన్ బేబి(12) అనే చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ చిన్నారికి మహేష్ బాబు అంటే చాలా ఇష్టమట. ఈ విషయం తెలుసుకున్న మహేష్.. స్వయంగా శ్రీకాకుళం వెళ్ళి… పర్వీన్‌ని కలిసి కొంత సమయం గడిపాడు. పర్వీన్ త్వరగా కోలుకోవాలని తనకి దైర్యం చెప్పాడట. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న వెంకటేష్ కూడా ఓ క్యాన్సర్ పేషెంట్ ని కలిసాడు. మహేష్ – వెంకటేష్ లు అన్నదమ్ములు లాగా కలిసుంటారన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కూడా తీశారు. ‘మొన్న పెద్దోడు .. ఈరోజు చిన్నోడు’… అంటూ సోషల్ మీడియా కొందరు కామెంట్లు పెడుతుండడం విశేషం.

Share.