ఒకవేళ పోకిరిలో కంగనా నటించి ఉంటే.. రచ్చ రంబోలా అయ్యేదేమో

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తో నటించాలంటే ప్రస్తుతం అన్నీ ఇండస్ట్రీ హీరోలు భయపడుతున్నారు. ఇక దర్శకుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అందుకే.. కంగనా ఆమె సొంత డైరెక్షన్ లో సినిమాలు చేయడానికే సన్నద్ధమవుతోంది. అయితే.. ఇటీవల కంగనా గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. నిజానికి పూరీ జగన్నాధ్ “పోకిరి” సినిమా టైమ్ లో ఇలియానా కంటే ముందు కంగనాను స్క్రీన్ టెస్ట్ చేశాడట. మహేష్ పక్కన కంగనా బాగానే సెట్ అవుతుంది అని ఫిక్స్ కూడా అయ్యాక ఆఖరి నిమిషంలో జరిగిన మార్పుల కారణంగా కంగనా స్థానంలో ఇలియానా వచ్చి చేరింది.

ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ.. ఒకవేళ “పోకిరి” సూపర్ హిట్ అయ్యి కంగనా ఇక్కడే సెటిల్ అయిపోయి ఉంటే ఆమె మైండ్ సెట్ కి ఇక్కడ హీరోలందరూ బలి అయిపోయేవాళ్లేమో, ముఖ్యంగా మహేష్ బాబు పరిస్థితి ఏమయ్యేదో అని ఒక్క కషణం కంగారుపడ్డారు. బాబోయ్.. ఆ ఊహే మరీ దారుణంగా ఉంది కదూ.

Share.