తెరపై కలిసి కనిపించనున్న చిరు, మహేష్

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి తెరపై కనిపించనున్నారు. ఈ వార్త చదవగానే  డైరక్టర్ ఎవరు? బడ్జెట్ ఎంత ? అని అడిగేయాలని ఉంది కదూ.. ఆగండి.. ఆగండి.. వారిద్దరూ కలిసి కనిపించేది వెండి తెరపైన కాదు. బుల్లి తెరపై. మాటీవీలో ప్రసారమవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోకి మహేష్ బాబు గెస్ట్ గా రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో ఇప్పటివరకు నాగార్జున , రానా, సాయి ధరమ్ తేజ్, సునీల్, వెంకటేష్, నాని పాల్గొని టీవీ ప్రేక్షకులను అలరించారు. త్వరలో మహేష్ రాబోతున్నారు.

ప్రస్తుతం స్పైడర్ షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ ని మీలో ఎవరు కోటీశ్వరుడు టీమ్ సంప్రదించింది. షోకి రావడానికి ఆయన అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది. మెగాస్టార్, సూపర్ స్టార్ ని ఒకే ఫ్రేమ్ లో చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు సరిపోవు. మహేష్ పాల్గొనే ఎపిసోడ్ పూర్తి వినోదాన్ని పంచుతుందని, టీఆర్పీ కూడా అత్యధికంగా నమోదవుతుందని షో నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.