అంచనాలను అందుకుంది కానీ.. ఆసక్తి రేకెత్తించలేకపోయింది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “మహర్షి”. అల్లరి నరేష్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు-అశ్వినిదత్-పి.వి.పి సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్-విజయ్ దేవరకొండ ముఖ్య అతిధులుగా హాజరవ్వడం విశేషం. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇవాళ విడుదల చేసారు. ఎప్పటిలానే మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ ట్రైలర్ లో.. మహేష్ బాబు మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు.

Mahesh Babu, Pooja Hegde, Allari Naresh, Vamshi Paidipally, DSP, Maharshi Movie

Mahesh Babu, Pooja Hegde, Allari Naresh, Vamshi Paidipally, DSP, Maharshi Movie

“ఓడిపోవడం అంటే నాకు భయం.. ఆ భయంతోనే ఇక్కడిదాకా వచ్చాను”, “మనం గతంలో ఏక్కడున్నాం.. ఇప్పుడు ఎక్కడున్నాం దాన్ని బట్టి మనకే అర్థమైపోతుంది సక్సెస్ అయ్యామా లేదా అని”, “ఓడిపోతాం అనే భయంతో ఆటలో దిగితే.. ఎప్పటికీ గెలవలేం” వంటి సంభాషణలు బాగున్నాయి. అలాగే.. కెమెరా వర్క్ & ప్రొడక్షన్ వేల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా కనిపిస్తున్న “మహర్షి ట్రైలర్” అంచనాలను పెంచలేకపోయిందనే చెప్పాలి. కాకపోతే.. ఆల్రెడీ నెలకొన్న అంచనాలకి తగ్గట్లుగానే ఉంది. మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ ప్రతిష్టాత్మక 25వ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. మరి సినిమా వారి అంచనాలను అందుకోగలుగుతుందో లేదో తెలియాలంటే.. మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే.

Share.