అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘మహర్షి’ దుమ్మురేపుతోంది..!

సంక్రాంతి కానుకగా వచ్చిన ఒకే ఒక్క పెద్ద చిత్రం ‘వినయ విధేయ రామా’. అది కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇక నాలుగు నెలలుగా ఒక్క పెద్ద చిత్రం కూడా రాలేదు. దీంతో ఇప్పుడొస్తున్న మరో పెద్ద చిత్రం మహేష్ ‘మహర్షి’ పైనే అందరి దృష్టి ఉంది. ఒక్క మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు టాలీవుడ్ ప్రేక్షకులు మొత్తం ఈ చిత్రం కోసమే ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. మల్టీ ప్లెక్సులతో పాటూ సింగల్ స్క్రీన్ లలో కూడా టిక్కెట్లు బుక్ అయిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్ లు ఓపెన్ చేసిన 5 నిమిషులకే టికెట్లు మొత్తం బుక్ అయిపోతున్నాయి.

చాలా రోజులుగా ఓ పెద్ద సినిమాకోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ‘మహర్షి’ చిత్రం ‘హాట్ కేక్’ లా దొరికినట్టుంది. అందులోనూ దిల్ రాజు లాంటి బడా ప్రొడ్యూసర్ సినిమా డిమాండ్ తెలుసుకుని థియేటర్లు పెంచుతున్నప్పటికీ బుకింగ్స్ వెంటనే అయిపోతున్నాయి. అన్ని టికెట్ బుకింగ్ సైట్లు సోల్డవుట్ బోర్డులు పెట్టేస్తున్నాయి. ‘మహర్షి’ చిత్రానికి ఏమాత్రం హిట్టు టాక్ వచ్చినా ‘నాన్ బాహుబలి’ రికార్డులన్నీ మొదటి వారానికే సైడ్ అయిపోవడం ఖాయం. అందులోనూ సమ్మర్ హాలిడేస్ కావడంతో 3 వారాలు హౌస్ ఫుల్స్ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందులోనూ మహేష్ బాబు లాంటి యూనివర్సల్ స్టార్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎగబడతారనడంలో సందేహమే లేదు.

Share.