మహానటి సావిత్రి గురించి ఆసక్తికర సంగతులు

సావిత్రి. తెలుగు వారికి పరిచయం చేయనవసరం లేని పేరు. చక్కని అభినయంతో ఆమె తెలుగుజాతి గర్వించే నటి అయ్యారు. నేటి తరం హీరోయిన్లకు ఆమె చిత్రాలు రిఫరెన్స్ గా మారాయి. అటువంటి అభినేత్రి నిజ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసారు. కష్టసుఖాలు అనుభవించారు. ఆ రహస్యాలను ఫిల్మీ ఫోకస్ సేకరించింది. మూడు విభాగాలుగా మీ ముందుకు తీసుకొస్తోంది. బాల్యం నుంచి పెళ్లి వరకు ఆమె జీవితంలో కీలక విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

తల్లి దండ్రులు Savitriసావిత్రి స్వస్థలం గుంటూరు. సావిత్రికి ఆరునెలలు అప్పుడే ఆమె తండ్రి నిస్శంకరరావు గురవయ్య చనిపోయారు. దాంతో అమ్మ సుభద్రమ్మ ఇద్దరు పిల్లలు మారుతి, సావిత్రిని తీసుకొని విజయవాడ లోని ఆమె అక్క దుర్గాంబ ఇంటికి వచ్చింది. దుర్గాంబ భర్త వెంకటరామయ్య వీరిని తన కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు.

బంగారు బొమ్మSavitriసావిత్రిని చిన్నప్పుడూ అందరూ బంగారు బొమ్మ , ముద్దులగుమ్మ అని పిలిచేవాళ్లు. పెదనాన్న వెంకటరామయ్య చౌదరి సావిత్రిని కస్తూరిబాయి మెమోరియల్ స్కూల్లో చేర్పించారు. ఆమె చదువులో కంటే డాన్స్, నటన పైనే ఆసక్తి కనబరిచేది. అందుకే శిష్టా పూర్ణయ్య శాస్త్రి వద్ద నాట్యంలో ఆమెకు శిక్షణ ఇప్పించారు.

పాములవాడి నృత్యం Savitriవివిధ ప్రాంతాల్లో పండుగలకు ఉత్సవాలకు సావిత్రి నృత్య ప్రదర్శనలు ఇచ్చేది. ఆమె రాధా కృష్ణ నృత్యం, పాములవాడి నృత్యాలకు బాగా పేరు వచ్చాయి. జగ్గయ్య కూడా సావిత్రి నాట్యం మెచ్చుకొని తన నాటక కంపెనీలో చేర్చుకున్నారు.

మొదటి ఛాన్స్ Savitri1948 లోఅఖిల భారత నృత్య నాటిక పోటీల్లో సావిత్రి నాటక ప్రదర్శన చూసిన ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూధనరావు సినిమా అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అతని పిలుపు మేరకు మద్రాస్ వెళ్లిన సావిత్రికి సంసారం అనే సినిమాలో కమల అనే క్యారక్టర్ ఇచ్చారు. అయితే కెమెరా ముందు భయపడి సరిగ్గా నటించలేకపోయింది. అలా తొలి అవకాశాన్ని వదులుకుంది. అప్పుడు చాలా బాధపడింది.

తొలి చూపులోనే ప్రేమ Savitriసినిమా అవకాశం కోసం మద్రాస్ వెళ్లిన సావిత్రికి నటిగా అవకాశం కంటే ముందు ప్రేమ పలకరించింది. ఫోటోల కోసం జెమిని స్టూడియోకి వెళ్లిన సావిత్రి అక్కడే ఉన్న జెమిని గణేశన్ ని చూసి ఇష్టపడింది. అప్పటి నుంచి ఇద్దరూ అప్పుడప్పుడూ మాట్లాడుకునేవారు.

గుంపులో గోవిందా Savitriకె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాళ భైరవి చిత్రంలో డ్యాన్స్ వేయడానికి అమ్మాయిల కోసం వెతుకుతుంటే ఆ ఛాన్స్ ని సావిత్రి అందిపుచ్చుకుంది. ఈ సారి దైర్యంగా డ్యాన్స్ చేసి అందరితో అభినందనలు అందుకుంది. పాతాళ భైరవి విజయం సాధించడంతో సావిత్రికి ఓ గుర్తింపు లభించింది.

వ్యాంప్ క్యారక్టర్ Savitriసినిమా అవకాస్లు తగ్గిపోతున్న సరే వ్యాంప్ క్యారక్టర్ వేయడానికి హీరోయిన్లు ముందుకు రారు. కానీ సావిత్రి కెరీర్ తొలి నాళ్ళలోనే రూపవతి అనే సినిమాలో వ్యాంప్ గా నటించింది.

మలుపుతిప్పిన చిత్రంSavitriసావిత్రి కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం దేవదాసు. ఇందులో పార్వతి పాత్రకు ముందుగా జానకిని అనుకున్నారు. ఆమె బిజీగా ఉండడంతో ఆ పాత్ర సావిత్రికి వచ్చింది. ఆ స్క్రిప్ట్ ని చదువుతున్నప్పుడు ఏడుపు ఆపుకోలేక పోయానని సావిత్రి ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. 1953 జూన్ 26 న విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఆఫర్లు తెచ్చిపెట్టింది. వాటిలో ఎక్కువగా విషాద పాత్రలు కావడం విశేషం.

టైటిల్ రోల్ Savitriఅతి తక్కువ కాలానికే సావిత్రి టైటిల్ రోల్ పోషించే ఛాన్స్ దక్కించుకుంది. మిస్సమ్మ గా నటించే అవకాశం పట్టేసింది. ఈ పాత్రను భానుమతి చేయాల్సింది. ఆమెను ఊహించుకునే పాత్రను డిజైన్ చేశారు. కానీ భానుమతి షూటింగ్ లేట్ గా రావడంతో చక్రపాణి ఆమెను పక్కన పెట్టి సావిత్రిని తీసుకున్నారు. అలా ఓ సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. దీంతో సావిత్రి స్టార్ హీరోయిన్ అయిపోయారు.

పెళ్లి Savitriఒక వైపు తెలుగు సినిమాల్లో బిజీగా ఉంటూనే తొలి చూపులోనే తన మనసును గెలుచుకున్న జెమిని గణేష్ తో ప్రేమలో మునిగిపోయారు. అతనికి ఇదివరకు రెండు పెళ్లిళ్లు అయినప్పటికీ మూడో భార్యగా తాళి కట్టించుకున్నారు. 1952 లో రహస్యంగా, సాధారణంగా సావిత్రి, జెమిని గణేష్ ల పెళ్లి జరిగింది.

పెళ్లి అయిన తర్వాత సావిత్రి లైఫ్ లో అనేక సంఘటనలు జరిగాయి. వాటిగురించి మహానటి లైఫ్ సీక్రెట్ 2 లో తెలుసుకుందాం.

Share.