సెక్సీ ఫోజులతో టాప్ లేపుతున్న ‘లోఫర్’ భామ..!

కొందరు సినీ తారలు కొన్ని ప్రముఖ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తుంటారు. ఇందుకోసం వారు నటించే సినిమాల్లో ఆ సంస్థకు చెందిన ప్రొడక్ట్స్ ని కానీ, మొబైల్స్ ని కానీ దుస్తుల్ని కానీ వాడుతున్నట్టు కనిపిస్తుంటారు. ఇక బయటకూడా వాటికోసం ఫోటో షూట్లు కూడా ఇస్తుంటారు. తప్పదు మరి… ఆ సంస్థలకి లాభాలు రావాలి. అప్పుడే ఆ సినీ తారలు.. ఆ సంస్థలకు న్యాయం చేసినట్టవుతుంది. ప్రస్తుతం ఈ విషయాన్ని బాలీవుడ్ భామ, ప్రముఖ మోడల్ అయిన దిశా పటానీకి బాగా తెలిసినట్టుంది. అందుకే లోదుస్తుల కంపెనీ కాల్విన్ క్లైన్(సీకే) ను ఓ రేంజ్లో ప్రమోట్ చేస్తుంది. ఈ భామ తీసుకుంటున్న పారితోషికానికి పూర్తి న్యాయం చేస్తుందన్నమాట.

disha-patani-stunning-going-viral1

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘లోఫర్’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఈ భామ తరువాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ‘సీకే’ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తూ మరింత పాపులర్ అయ్యింది. గతేడాది దీపావళి సందర్భంగా లెహంగాపై ‘కాల్విన్ క్లైన్ బ్రా’ వేసుకుని ఒక చేతితో దీపం పట్టుకుని సెక్సీ పోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరవాత అవకాశం చిక్కినప్పుడల్లా ‘కాల్విన్ క్లైన్’ కు చెందిన రకరకాల లోదుస్తులు వేసుకుని ఉన్న ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇక ఈ ఫొటోలను చుసిన మన నెటిజన్లు ఊరుకుంటారా… లక్షలకొద్దీ లైకులు, కామెంట్లు పెట్టేసి ఈ ఫోటోలను వైరల్ చేసేస్తున్నారు. ఇప్పటికే నలుపు,తెలుపు రంగు లోదుస్తులతో ఫోజులిచ్చిన దిశా.. తాజాగా ఎరుపు రంగు లోదుస్తులను కూడా ధరించి కుర్రకారుని హీటెక్కిస్తోంది. ‘ఏ హీరోయిన్ కూడా ఈ రేంజ్లో సెక్సీ ఫోజులిఛ్చి ఉండదు’ అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక దిశా నటించిన ‘భారత్’ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది.

Share.