భారీ రేట్ పలుకుతున్న “లై” శాటిలైట్ రైట్స్‌!!

టాలీవుడ్ లో యువ హీరోల్లో నితిన్ ఒకడు అన్న విషయం అందరికీ తెలిసిందే…అయితే ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో జయం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నితిన్, ఆ తరువాత వరుసగా సినిమాలు ఐతే చేశాడు కానీ….పెద్దగా హిట మాత్రం అందుకోలేక పోయాడు. ఇక అదే క్రమంలో వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందుల్లో పడ్డ నితిన్ కి చాలా గ్యాప్ తర్వాత ‘గుండె జారీ గల్లంతయ్యిందే’, ‘ఇష్క్’ చిత్రాలు మంచి విజయం అందించి నితిన్ ని మళ్లీ సూపర్ స్టార్ గా నిలబెట్టాయి…ఇక అదే క్రమంలో గత సంవత్సరం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ..ఆ.’ నితిన్ కెరీర్ లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది కానీ ఆ చిత్రంలో నితిన్ కన్నా హీరోయిన్ సమంతకే ఎక్కువ పేరు వచ్చింది అని ఒప్పుకోక తప్పదు.

ఇదిలా ఉంటే అసలు మ్యాటర్ లోకి వెళితే…యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ లై అన్న విషయం తెలిసిందే…ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఇండ‌స్ట్రీ, సినీ అభిమానుల‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల్లోను క్రేజ్ సొంతం చేసుకుంది కూడా . ఇక ఇటీవ‌ల రిలీజ్ అయిన లై టీజ‌ర్ దెబ్బ‌తో సినిమాపై భారీ హైప్ నెల‌కొంది. లై టీజ‌ర్ చాలా కొత్త‌గా ఉండ‌డంతో సినిమా కూడా అంతే కొత్త‌గా ఉంటుంద‌న్న అంచ‌నాలు అంద‌రిలోను ఉన్నాయి. ఇక ఈ సినిమా క్రేజ్ దృష్ట్యా లై శాటిలైట్ రైట్స్ అదిరిపోతోంది. ఓ ప్ర‌ముఖ ఛానెల్ లై శాటిలైట్ రైట్స్‌ను సొంతం చేసేందుకు రూ. 7 కోట్లు ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ డీల్ ఓకే అయితే ఇది నితిన్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ శాటిలైట్ రేటుగా నిలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే వరుస ఫ్లాప్స్ నుంచి హిట్ హీరోగా మారిన నితిన్ రోజు రోజుకీ తన రేంజ్ పెరిగిపోతూ దూసుకెళ్తున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.