కుశ టీజర్ | జై లవ కుశ | ఎన్టీఆర్

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవ కుశ’ కూడా ఒకటి. తారక్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తుండటం వలన ఈ సినిమాకు ఎక్కడాలేని క్రేజ్ నెలకొంది. ఇప్పటికే మూడు పాత్రల్లో రెండు జై, లవ కుమార్ ల తాలూకు టీజర్లు విడుదలై బాగా ఆకట్టుకోవడంతో ఆ హైప్ మరింత ఎక్కువైంది. ఇప్పుడు ఆ హైప్ ఇంకాస్త రెట్టింపు చేసేలా సినిమాలోని మూడవ పాత్ర, ఆడియోలో విశేషంగా ఆకట్టుకున్న కుశ క్యారెక్టర్ తాలూకు టీజర్ విడుదల చేశారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.