కురుక్షేత్రం

యాక్షన్ కింగ్ అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన 150వ చిత్రం “నిబునన్”. తమిళంలో అరుణ్ వైద్యనాధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సొంతం చేసుకొంది. ఆ చిత్రాన్ని “కురుక్షేత్రం” పేరుతో తెలుగులోకి అనువదించారు. సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడం కోసం ఓ స్పెషల్ పోలీస్ టీం వేసే ఎత్తులు, వారి నుంచి తప్పించుకోవడానికి ఆ సీరియల్ కిల్లర్ వేరే పైఎత్తుల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ యాక్షన్ థ్రిల్లర్ మన తెలుగు ఆడియన్స్ ను ఏమేరకు ఎంగేజ్ చేసిందో చూద్దాం..!! kurukshetram

కథ : రంజిత్ కాళిదాస్ అలియాస్ రంజిత్ (అర్జున్) డిప్యూటీ సూపరెండెంట్ ఆఫ్ పోలీస్. అతని టీం మేట్స్ వందన (వరలక్ష్మీ శరత్ కుమార్), జోసెఫ్ (ప్రసన్న) కలిసి ఎలాంటి కేస్ అయినా చాకచక్యంగా సాల్వ్ చేస్తుంటారు. అందుకే సిటీలో జరుగుతున్నా దారుణమైన సీరియల్ మర్డర్లకు సంబంధించిన కేస్ ను వారికి అప్పగిస్తుంది డిపార్ట్ మెంట్. హంతకుడు తాను బంధించినవారిని హత్య చేస్తున్న విధానంతోపాటు.. తదుపరి ఎవరిని హత్య చేయబోతున్నాడో ఇచ్చే క్లూస్ కరణంగా ఆతడొక సైకో కిల్లర్ అని తెలుసుకొంటారు. ఆ కిల్లర్ ను పట్టుకొనే ప్రయత్నంలో రంజిత్ & టీం పలుమార్లు ఓడిపోతారు.

అయితే.. తాము అనుకొంటున్నట్లుగా వాడు సైకో కిల్లర్ కాదని, ఈ వరుస హత్యలు.. వాటి క్లూస్ వెనుక పెద్ద కథ ఉందని తెలుసుకొంటారు. ఇంతకీ ఎవరా హంతకుడు? రంజిత్ & టీం చివరికి అతడ్ని పట్టుకోగలిగారా? లేదా? ఈ “కురుక్షేత్రం”లో ఎవరు గెలిచారు? అనేది సినిమా కథాంశం. kurukshetram-2

నటీనటుల పనితీరు : మన యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరోసారి అదరగొట్టే పెర్ఫార్మెన్స్ తో ఇరగదీశారు. యాక్షన్ సీక్వెన్స్ లు మరీ అతి అని ఎక్కడా అనిపించకుండా లాజికల్ గా డీల్ చేసిన విధానం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అలాగే.. ఎమోషనల్ గానూ ఆడియన్స్ ను ఆకట్టుకొన్నారు అర్జున్. ఆయన పాత్రలోని డిఫరెంట్ షేడ్స్ ఆశ్చర్యం కలిగించడం మాత్రమే కాదు ఎంటర్ టైన్ చేస్తాయి కూడా.

వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ చిత్రంలో సబార్డినేట్ గా మంచి పాత్రలో కనిపించింది. ఆమె బాడీ లాంగ్వేజ్ మరీ నాటుగా ఉన్నా.. క్యారెక్టరైజేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.. అలాగే ప్రసన్న కూడా పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకొన్నాడు. శ్రుతి హరిహరన్ ఈ చిత్రంలో కథానాయికగా ఉన్న తక్కువ సన్నివేశాల్లోనే తన గ్లామర్ & స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించింది.

వైభవ్ తమ్ముడి పాత్రకు న్యాయం చేయగా.. సైకో కిల్లర్ గా కృష్ణ క్లైమాక్స్ లో అలరించాడు. ఓవరాల్ గా ఆర్టిస్టులందరూ తమ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. kurukshetram

సాంకేతికవర్గం పనితీరు : ఎస్.నవీన్ పాటల కంటే నేపధ్య సంగీతం బాగుంది. సినిమాలోని సస్పెన్స్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేసే బ్యాగ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని సినిమాలో ఇన్వాల్వ్ చేశాడు. అరవింద్ కృష్ణ సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ & యాంగిల్స్ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేసిన విధానం ఎగ్జైట్ చేస్తుంది.

తెలుగు డబ్బింగ్ క్వాలిటీ & లిరిక్స్ కూడా బాగున్నాయి. తమిళంలో ల్యాగ్ అయిన కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేయడమే కాక స్క్రీన్ ప్లేను కాస్త ఫాస్టప్ చేసిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది.

దర్శకుడు అరుణ్ వైద్యనాధన్ రాసుకొన్న కథలో “ఆరుషి హత్య కేసు”ను ఇన్వాల్వ్ చేసిన విధానం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఒక క్రైమ్ థ్రిల్లర్ లో యాక్షన్ ను ఇంక్లూడ్ చేసి.. సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించిన తీరు ఆడియన్స్ ను విశేషంగా ఎంటర్ టైన్ చేస్తుంది. క్యారెక్టర్స్ ను డిజైన్ చేసిన విధానం ఇలా అన్నీ బాగున్నాయి కానీ.. క్లైమాక్స్ ను మాత్రం సరిగా డీల్ చేయలేకపోయాడు. అందువల్ల అప్పటివరకూ వచ్చిన ఫీల్ కాస్త దెబ్బతింటుంది. ఆ ఒక్క మైనస్ తప్పితే సినిమా మొత్తం ప్రేక్షకుడ్ని బాగా ఇన్వాల్వ్ చేసి ఎంటర్ టైన్ చేస్తుంది. kurukshetram

విశ్లేషణ : కొత్త జోనర్ కాకపోయినా.. డిఫరెంట్ గా ఎంటర్ టైన్ చేసే యాక్షన్ థ్రిల్లర్ “కురుక్షేత్రం”. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్ ను కోరుకొనే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. మరీ భారీ అంచనాలు కాకుండా టైమ్ పాస్ కోసం వెళితే హుందాగా ఎంటర్ టైన్ చేసే సినిమా ఇది.kurukshetram-5

రేటింగ్ : 2.5/5

Share.