ఆకట్టుకున్న కృష్ణార్జున యుద్ధం థియేట్రికల్ ట్రైలర్!

వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచుర‌ల్‌ స్టార్ నాని ఎంసీఏ తరవాత చేసిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్ లు హీరోయిన్స్ గా నటించారు. జెంటిల్ మ్యాన్ సినిమా తర్వాత నాని డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీ ట్రైలర్ నేడు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రీ రిలీజ్ కార్యాక్రమంలో ఈ వీడియోను విడుదల చేశారు. చిత్తూరు కుర్రోడు కృష్ణ పాత్రలో నాని చెప్పిన డైలాగ్స్ మాస్ ప్రేక్షకులకు తెగ నచ్చేసాయి.

రాక్‌స్టార్‌గా అర్జున్ క్లాస్ పీపుల్స్ ని కవర్ చేసాడు. వీరిద్దరూ కలిసి ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పంచనున్నట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. కామెడీ ఎక్కువగా ఉన్నట్లు అర్ధమవుతోంది. తమిళ సంగీత దర్శకుడు  హిప్ హాప్ త‌మీజా ఈ చిత్రానికి ఇచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. షైన్ స్క్రీన్స్ పతాకంపై గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది. నానికి మరో హిట్ ఇవ్వనుంది.

Share.