చిక్కుల్లో క్రిష్, కంగనా రనౌత్ సినిమా

గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ మరో చారిత్రాత్మక ఘట్టాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. వీరనారిగా కీర్తి పొందిన ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితాన్ని వెండితెరపై చూపించడానికి రెడీ అయ్యారు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి ‘మణికర్ణిక – ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ అనే టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్లో సంజయ్ కుట్రీ, నిషాద్ పిట్టి హిందీలో నిర్మిస్తున్న ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. ఝాన్సీకి రాణి లక్ష్మి భాయి అసలు పేరు మణికర్ణిక. మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె1828 లో వారణాసిలో జన్మించారు. అందుకే సినిమాను అక్కడి నుండే ప్రారంభించాలని నిర్ణయించిన క్రిష్ కి అడ్డంకి ఎదురైంది.

కంగనా రనౌత్ తన సినిమాను హైజాక్ చేసిందని ఆరోపిస్తూ బాలీవుడ్ దర్శకుడు కేతన్ మెహతా కంగనాకు నోటీసులు పంపారు. తాను 2015లోనే కంగనాతో ‘రాణి ఆఫ్ ఝాన్సీ’ సినిమా గురించి మాట్లాడానని, అప్పుడు సినిమా చేయటానికి ఒప్పుకున్న కంగనా అదే కథతో ఇంకో దర్శకుడి తో పని చేయటానికి సిద్దపడిందంటూ కేతన్ మెహతా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు త్వరలో విచారణకు రానుంది. ఈ సినిమాను 2018 ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనీ పక్కా షెడ్యూల్ చేసిన క్రిష్ ఇప్పుడు అయోమయంలో పడ్డారు. కేసు విచారణ తర్వాత సినిమా ప్రారంభించాలా? లేకుంటే వేరే ప్రాజక్ట్ మొదలు పెట్టాలా? అనే ఆలోచనలో ఉన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.