మెగాస్టార్ చేతులు మీదుగా ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్ విడుదల..!

భీమనేని శ్రీనివాసరావు.. టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు. పవన్ కళ్యాణ్ తో ‘సుస్వాగతం’, వెంకటేష్ తో ‘సూర్యవంశం’ వంటి బ్లాక్ బస్టర్ లు తెరకెక్కించిన దర్సకుడాయాన..! అంతే కాదు రీమేక్ చిత్రాలకి కేర్ అఫ్ అడ్రెస్స్ అంటే ఈయన పేరే చెప్పుకోవచ్చు. ఈయన డైరెక్షన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘కౌసల్య కృష్ణ మూర్తి’. ‘ది క్రికెటర్’ అనేది క్యాప్షన్. ‘క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్’ పై కె.ఎస్.రామా రావు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘కనా’ అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసారు.

kousalya-krishnamurthy-teaser-review1

kousalya-krishnamurthy-teaser-review2

మహిళల క్రికెట్ నేపద్యంలో సాగే కధాంశంతో ఈ చిత్రం రూపొందిందని.. టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. క్రికెటర్ అవ్వాలి అనుకునే అమ్మాయి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా.. ఆవిడను ప్రోత్సహించే తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడు. మరో పక్క రైతుల సమస్యల గురించి కూడిన ఎమోషనల్ సీన్లు కూడా ఉన్నాయి. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. భీమనేని ఈ మద్య చేసిన రీమేక్ లన్నీ ఫ్లాపులు గా మిగిలిన సంగతి తెలిసిందే. ఇది కూడా ఆ భాటలోనే నడిచేలా ఉంది. ఈ టేజర్ చూస్తే ఈ సినిమాని రీమేక్ చేసారా? లేక డబ్బింగ్ చేసారా? అనే అనుమానం కలుగక మానదు. శివ కార్తికేయన్ తప్ప ఈ టేజర్లో పెద్ద స్పెషల్ ఏమీ లేదు.

Share.