భయపెట్టే కొత్త పెళ్లి కూతురు

కొత్త పెళ్లి కూతురు టైటిల్ అనగానే.. అది కుటుంబ కథ చిత్రం అని అనుకోవడం సహజం. ఆమె భయపెడుతుంది.. అంటే.. తన అహంకారంతో, తెలివితేటలతో బయపెడుతుందేమోనని భావిస్తారు.. ఈ ఆలోచనలకూ విరుద్ధమైనది కొత్త పెళ్లికూతురు వెబ్ సిరీస్. ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ లో పెళ్ళికి తిరుపతికి వెళుతున్న ఓ బస్సు యాక్సిడెంట్ కి గురి అయ్యి అందరూ చచ్చిపోతారు. పెళ్లి కూతురు మాత్రమే బతుకుతుంది అని వెల్లడించారు. ఆమె తాను పెళ్లి చేసుకున్న తర్వాత ఉండబోయే 360 నంబర్ ప్లాట్ కి వచ్చి బాధతో ఉరి వేసుకొని చనిపోయిందని వివరించారు.

ఇక రెండో ఎపిసోడ్ లో ఆమె దెయ్యమై .. ఆప్లాట్ లోకి వచ్చి చేరిన సినిమా రైటర్ ని ప్రేమిస్తుంది. పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఈ కథ ని చదువుతుంటే ఫీల్ ఉందదు కానీ.. మీరు ఈ సిరీస్ ని చూస్తే చాలా థ్రిల్ ఫీలవుతారు. ఎటువంటి గ్రాఫిక్స్ లేకున్నా.. మణికంఠ టేకింగ్ ప్రతిభతో.. కోటి కెమెరా పనితనం, త్రినాథ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కలిసి చమటలు పట్టిస్తుంది. రన్ వే రీల్ వాళ్ళు  మంచి షార్ట్స్ ఫిల్మ్ ని ప్రోత్సహిస్తారని ఈ వెబ్ సిరీస్ ద్వారా మరోసారి నిరూపించుకున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.