కొడకా కోటేశ్వర్ రావు ఫుల్ సాంగ్ | పవన్ కళ్యాణ్ | అజ్ఞాతవాసి

‘అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన ‘కొడకా కోటేశ్వర్ రావు’ పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ ఈ సాంగ్ టీజర్ విడుదల చేశారు. దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ దగ్గరుండి ఈ పాటను రికార్డ్ చేయించారు. కొడకా కోటేశ్వరరావు సాంగ్…. 2018లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే ఈ పాటపై భారీగా అంచనాలున్నాయి. అజ్ఞాతవాసి సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ గత సినిమాలో పాడిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Share.