ఆ సీన్లకు అస్సలు ఇబ్బంది పడలేదు : కియారా

టాలీవుడ్ లో కియారా కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చేసింది కేవలం రెండు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులు ఈమె గ్లామర్ కి ఫిదా అయిపోయారు. మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ ‘భరత్ అనే నేను’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కియారా, చరణ్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కూడా నటించింది. తర్వాత మరో సినిమాను ఓకే చేయకుండా.. ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ రీమేక్ పైనే ఫోకస్ పెట్టింది. ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ‘ఈ చిత్రం విడుదల కోసం ఎంతో అసతిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. కచ్చితంగా ఈ చిత్రం హిట్టవుతుందని ధీమా వ్యక్తం చేస్తుంది. ‘అర్జున్ రెడ్డి’ (ఒరిజినల్)లో నటించిన షాలినీ పాండేను తానిప్పటివరకూ కలవలేదని చెప్పింది’. మరి.. సినిమాలో బోలెడన్ని ముద్దుసీన్లు ఉంటాయి కదా? ఇబ్బంది పడలేదా? అన్న ప్రశ్నకు.. ‘నేటి ప్రేమల్లో ముద్దులు.. కౌగిలింతలు సహజం. ఇప్పటి సినిమాల్లో అవన్నీ సహజంగా.. అందంగానే ఉంటాయి.. అందుకే నాకు ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు” అంటూ చాలా తెలివిగా జవాబిచ్చింది.

Share.