మహేష్ సరసన నటిస్తున్నందుకు సంతోషంలో బాలీవుడ్ బ్యూటీ

నేటి హీరోయిన్స్ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకునే హీరో మహేష్ బాబు. ఈ అందాల రాజకుమారుడితో నటించే అవకాశం తొలి సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ దక్కించుకుంది. ఎం.ఎస్ ధోని సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టిన ఈ భామ “భరత్ అనే నేను” తో తెలుగులో పరిచయం అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. రీసెంట్ గా మహేష్, కైరా కాంబినేషన్ సీన్ ఒకటి షూట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “నేను ఎంత సంతోషంగా ఉన్నానో మీకు చెప్పలేను. మహేష్ బాబుతో నటించాలనే కల ఇంత తొందరగా నెరవేరుతుందని అనుకోలేదు.

పైగా నా మొదటి సినిమా మహేష్ బాబుతో అవ్వడం మరింత ఆనందంగా ఉంది” అని తన ఆనందాన్ని పంచుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ని లఖ్నో లో జరగనుంది. త్వరలో చిత్ర బృందం అక్కడికి వెళ్లనుంది. మహేష్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న  “భరత్ అనే నేను” సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.