మెగా150…100 టచ్ చేసింది!!!

టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని, మెగాస్టార్ గా అభిమానుల మన్నలను పొందిన హీరో చిరంజీవి…అనుకోని ఆలోచనతో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి…అక్కడ షో ఫ్లాప్ కావడంతో తిరిగి సినిమా గూటికే చేరుకుని మళ్లీ ముఖానికి రంగులు వేసుకున్నాడు…అయితే మంచి కధ కధనంతో తన 150వ సినిమా తియ్యలి అన్న ఆలోచనతో మొదలు పెట్టిన చిరంజీవి చివరకు ఒక ఫక్తు తమిళ కధను అరువు తెచ్చుకుని పెద్ద మార్పులు ఏమీ లేకుండా మక్కికి మక్కీ దించేసాడు…అయితే ఆయనపై అభిమానం ఉన్న అభిమానులు ఆయన 150వ సినిమా కోసం చాలా ఆశగా ఎదురు చూశారు…అదే క్రమంలో ఈ సినిమాకు బ్రహ్మరధం కూడా పట్టారు…టాలీవుడ్ లో సంక్రాంతి సందడిలో రిలీజ్ అయిన సినిమా కావడంతో ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చాయి…అయితే రొటీన్ కధ కావడం, అందులోనూ రీమేక్ కధ కావడంతో సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుని, హిట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే దాదాపుగా 9ఏళ్ల తరువాత చిరు ఎంట్రీ కావడంతో మొత్తంగా ఈ సినిమా 100రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది….అసలే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రన్ ఒకటి రెండు వారలకే పరిమితం అవుతున్న సమయంలో, దాదాపుగా 100రోజులు ఆడటం అందులోనూ చిరు లాంగ్ గ్యాప్ తరువాత రావడం నిజంగా చిరు స్టార్ డమ్ ను తెలియజేస్తుంది…మొత్తంగా చిరుని వినయ్ చాలా జాగ్రత్తగా ట్రీట్ చేశాడు…ఇక తెరపై లాంగ్ గ్యాప్ తర్వాత తమ హీరో మెరవడంతో మురిసిపోయారు మెగా ఫ్యాన్స్….ఇప్పుడు అదే సినిమా 100రోజులు పూర్తి చేసుకోవడంతో ఫుల్ హ్యాపీ అంట.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.