కీర్తి సురేష్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

సినీ పరిశ్రమలో నెగ్గుకురావాటాలంటే అందాల ఆరబోత ఒక్కటే మార్గం కాదని మరోసారి నిరూపించిన నటి కీర్తి సురేష్. అభినయంతోను ఆకట్టుకోవచ్చని కేరళ కుట్టీ చాటిచెప్పింది. నేను శైలజ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తొలి చిత్రంతోనే తెలుగు ప్రజల మనసుదోచుకుంది. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని తో కలిసి నేను లోకల్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ టీజర్ లో ఆమె హావభావాలతో అందరినీ కట్టిపడేశాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిల్మ్ లో అవకాశం దక్కించుకున్న కీర్తి సురేష్ గురించి ఆసక్తికర విషయాలు..

మేనక ముద్దల కుమార్తెKeerthi Sureshసినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో కీర్తి సురేష్ పుట్టింది. తండ్రి సురేష్ కుమార్ నిర్మాత. తల్లి మేనక నటి. ఈమె 80 వ దశకంలో బిజీ హీరోయిన్. మలయాళం, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో చిరంజీవి పున్నమినాగు చిత్రంలోని పూర్ణ పాత్ర పోషించి అభిమానులను సొంతం చేసుకుంది. తల్లి నుంచి నటనను వారసత్వంగా అందుకొని కీర్తి సినిమాల్లో రాణిస్తోంది.

ఎనిమిదేళ్లకే ఎంట్రీ Keerthi Sureshచిన్నప్పుడే కీర్తి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన తల్లి మేనక నిర్మించిన “ఆచేనియన్ ఎనుకిష్టం” అనే చిత్రంలో బాలనటిగా చేసింది. అప్పుడు ఆమె వయసు ఎనిమిదేళ్లు. మూడు సినిమాలతో పాటు, పలు సీరియల్స్ లోను నటించి అభినందనలు అందుకుంది.

డ్యుయల్ రోల్ సాహసం Keerthi Sureshకీర్తి హీరోయిన్ గా డ్యూల్ రోల్ తో అడుగుపెట్టింది. ప్రియదర్శిని దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి(2013 ) అనే మలయాళం మూవీలో గీత, అంజలిగా నటించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో స్క్రీన్ ని పంచుకొని శెభాష్ అనిపించుకుంది.

స్విమ్మింగ్ ఛాంపియన్Keerthi Sureshస్కూల్, కాలేజీల్లో తోటి విద్యార్థులకంటే కీర్తి చాలా యాక్టివ్ గా ఉండేది. మైమ్, డ్యాన్స్, డ్రామాలలో అదరగొట్టేది. అంతేకాదు ఈమె ఈత బాగా చేస్తుంది. స్విమ్మింగ్ పోటీలో అనేకసార్లు బహుమతులు కైవసం చేసుకుంది.

అద్భుతమైన డిజైనర్ Keerthi Sureshకీర్తి అందమైన డ్రస్సుల్లో మెరిసిపోవడమే కాదు అద్భుతంగా డ్రస్సులను డిజైన్ చేయగలదు. ఈమె ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసింది. లండన్లో ఇంటర్న్ షిప్ కూడా చేసింది. త్వరలో తాను డిజైన్ చేసిన దుస్తులతో బోటిక్స్ ప్రారంభించనుంది.

విజయ్, సూర్యలకు పెద్ద ఫ్యాన్ Keerthi Sureshకీర్తికి తెలుగు, తమిళంలో చాలామంది అభిమానులున్నారు. ఆమె మాత్రం విజయ్, సూర్యలకు పెద్ద ఫ్యాన్. చిన్నప్పటినుంచి వారి చిత్రాలను ఎక్కువ చూస్తుంది. ఈ విషయాన్నీ ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పింది. విజయ్ తో భైరవ సినిమాలో కలిసి నటించింది. సూర్యతోను త్వరలో సినిమా చేయనుంది.

డ్రీమ్ రోల్స్ Keerthi Sureshకీర్తి సురేష్ కి అనేక డ్రీమ్ రోల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా బాలీవుడ్ ఫిలిం క్వీన్ లో కంగనా రనౌత్ పోషించిన పాత్రలో కనిపించాలనేది ఆమె కల అంట. కహానీలో విద్యాబాలన్ క్యారక్టర్ అంటే కూడా చాలా ఇష్టం. అటువంటి క్యారెక్టర్లో కీర్తిని చూడాలని అనేకమంది అభిమానులు కోరుకుంటున్నారు.

బ్యూటీ సీక్రెట్ Keerthi Sureshబ్రాహ్మణ కుటుంబంలో జన్మించడంతో కీర్తి పూర్తిగా శాఖాహారి. ఉదయానే పాలు, గోధుమ బ్రేడ్ టోస్ట్, మధ్యాహ్నం చపాతీ, రాత్రి పప్పుతో అన్నం తింటుంది. తేలికపాటి వ్యాయామాలు, కొంత సేపు యోగ చేయడం ఒక్క రోజు కూడా మిస్ చేయదు. ఇదే ఆమె బ్యూటీ సీక్రెట్.

Share.