కళ్యాణ్ రామ్ సినిమా వలెనే ఆగిపోయిన కీర్తి సురేష్ సినిమా..!

సాధారణంగా ఒక్కసారి స్టార్ హీరోయిన్ స్టేటస్ వస్తే… వరుసగా పెద్ద హీరోల సరసన నటిస్తూ.. బిజీగా ఉంటారు హీరోయిన్లు. అయితే కీర్తి సురేష్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ‘మహానటి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న తరువాత కీర్తి సురేష్ తెలుగులో మరే చిత్రంలోనూ కనిపించలేదు. ఆచి.. తూచి.. కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్నే ఎంచుకుంటుంది. ఈ క్రమంలోనే మొన్నామధ్య ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్యాణ్ రామ్ తో గుహన్ డైరెక్షన్లో ‘118’ లాంటి చిత్రాన్ని నిర్మిస్తున్న మహేష్ కోనేరు ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్నినిర్మించనుంది. దీనికి సంబందించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేశారు. అయితే ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ వాయిదాపడ్డట్టు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని మొదటి ఫిబ్రవరి 14న ప్రారంభించాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదాపడబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం కళ్యాణ్ రామ్ 118 చిత్రమే కారణమని… ఆ చిత్రానికి భారీగా ఖర్చుపెట్టడంతో కీర్తి సురేష్ చిత్రానికి వచ్చే సరికి… మహేష్ కోనేరుకి ఆర్ధిక ఇబ్బందులు వాటిల్లాయని… ఈ కారణంగానే షూటింగ్ వాయిదాపడినట్టు తెలుస్తుంది. అయితే ఈ కీర్తి సురేష్ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టేది త్వరలో ప్రకటిస్తారని సమాచారం. కళ్యాణీ మాలిక్‌ సంగీమందిస్తున్న ఈ చిత్రంతో నరేంద్ర అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు.

Share.