కీ

“రంగం”తో తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరుచుకొన్న జీవా కథానాయకుడిగా తెరకెక్కిన తాజా తమిళ చిత్రం “కీ”. సైబర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగులోకి అనువదించారు. నిన్న తమిళంలో విడుదలవ్వగా.. నేడు తెలుగులో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!

Jiiva, Nikki Galrani, Anaika Soti, Kalees, Vishal Chandrashekar, Kee Movie Review, Kee Movie, Kee Telugu Movie,

కథ: అందమైన అమ్మాయిల ఫోన్లు హ్యాక్ చేసి.. అందులో ఇన్ఫో బట్టి వాళ్ళతో ఫ్లర్ట్ చేసే సరదా కుర్రాడు సిద్ధు (జీవా). అలా పబ్ లో పరిచయమైన వందన (అనైక సోటి) రొమాన్స్ చేయడానికి ప్రయత్నించే తరుణంలో ఆమెకు వచ్చిన ఒక సైబర్ ట్రబుల్ కు హెల్ప్ చేసే ప్రయత్నంలో ఒక సైబర్ హ్యాకింగ్ గ్రూప్ తో ఆన్ లైన్ లో తలపడతాడు సిద్ధు.

ఆ క్రమంలో ఆ హ్యాకింగ్ టీం సిద్ధుని టార్గెట్ చేస్తుంది. సిద్ధు ఆ హ్యాకింగ్ టీం ను తన తెలివితేటలతో ఎలా ఎదుర్కొన్నాడు? అనేది “కీ” కథాంశం.

Jiiva, Nikki Galrani, Anaika Soti, Kalees, Vishal Chandrashekar, Kee Movie Review, Kee Movie, Kee Telugu Movie,

నటీనటుల పనితీరు: జీవా ఒక హ్యాకర్ రోల్లో ఇమిడిపోయాడు కానీ.. హ్యాకర్ మ్యానరిజమ్స్ మాత్రం రీక్రియేట్ చేయలేకపోయాడు. రోమాంటిక్ సీన్స్ మరియు కామెడీతో మాత్రం ఆకట్టుకొన్నాడు. నిక్కి గల్రాని, అనైక సోటి గ్లామర్ డాల్స్ గా మిగిలిపోయారు. వాళ్ళ పాత్రలకి మంచి స్కోప్ ఉన్నప్పటికీ.. వాళ్ళ నుంచి దర్శకుడు సరైన నటన రాబట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రుల పాత్రల్లో రాజేంద్రప్రసాద్, సుహాసిని.. స్నేహితుడి పాత్రలో ఆర్జే బాలాజీ ఆకట్టుకొన్నారు.

Jiiva, Nikki Galrani, Anaika Soti, Kalees, Vishal Chandrashekar, Kee Movie Review, Kee Movie, Kee Telugu Movie,

సాంకేతికవర్గం పనితీరు: అభినందన్ రామానుజన్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. వాళ్ళ వర్క్స్ వల్ల సినిమాకి వేల్యూ యాడ్ అయ్యింది. దర్శకుడు “కలీస్” రాసుకున్న కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ చిత్రం “డై హార్డ్ 5” మరియు రీసెంట్ సైబర్ యాక్షన్ థ్రిల్లర్ “అభిమన్యుడు” చిత్రాలను తలపించడం వలన సినిమా బాగా బోర్ కొడుతుంది. అలాగే.. కథ రాసుకోవడంలో చూపిన నవ్యత కథనం విషయంలో చూపలేదు దర్శకుడు. దాంతో స్క్రీన్ ప్లే మరీ పేలవంగా సాగుతుంది.

అన్నిటికంటే ముఖ్యంగా.. హీరో-విలన్ మధ్య ఫైట్ లో ఇంటెన్సిటీ కనిపించదు. పైగా.. ఒక సైబర్ థ్రిల్లర్ లో యాక్షన్ సీన్స్ అంటే టెక్నికల్ గా బాగుండాలి. ఈ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ లో ఇవన్నీ లోపించాయి. పైగా.. క్లైమాక్స్ లో హీరో విలన్స్ ని పట్టుకొనే సీన్ కి లాజిక్ అస్సలు లేదు. దాంతో ఇదేం సైబర్ క్రైమ్ థ్రిల్లర్ రా బాబు అనిపిస్తుంది.

Jiiva, Nikki Galrani, Anaika Soti, Kalees, Vishal Chandrashekar, Kee Movie Review, Kee Movie, Kee Telugu Movie,

విశ్లేషణ: సైబర్ క్రైమ్ థ్రిల్లర్ అనగానే ఏదో ఎక్స్ పెక్ట్ చేయకుండా ఉంటే పర్లేదు కానీ.. టెక్నికల్ గా ఏదో ఉంటుందని ఊహించి థియేటర్ కి వెళ్తే మాత్రం దారుణంగా బోల్తా కొడతారు.

Jiiva, Nikki Galrani, Anaika Soti, Kalees, Vishal Chandrashekar, Kee Movie Review, Kee Movie, Kee Telugu Movie,

రేటింగ్: 1.5/5

Share.