మర్డర్ మిస్టరీ నేపధ్యంలో సాగే అనసూయ చిత్రం

“రంగస్థలం”లో రంగమ్మత్తగా నటించి తన నట ప్రతిభ చాటుకోవడంతోపాటు.. మార్కెట్ ను కూడా పెంచుకుంది. ఆమె కోసం ప్రత్యేక పాత్రలు కాకుండా ఆమెకోసం సినిమాలు రాసుకొనే స్థాయికి ఎదిగింది అనసూయ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “కథనం” టీజర్ ను ఇవాళ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ధనరాజ్, రణధీర్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా రాజేష్ నాదెండ్ల దర్శకుడిగా పరిచయంకానున్నాడు.

kathanam-movie-teaser1

kathanam-movie-teaser2

ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తాను డైరెక్టర్ అయ్యాక తీద్దామని రాసుకున్న ఒక మర్డర్ మిస్టరీలో ఉన్నట్లుగా కొన్ని హత్యలు జరుగుతుంటాయి. ఆమె రాసుకున్న స్క్రిప్ట్ పేరు “కథనం”. ఆ హత్య కేసుల్లో పోలీసులు ఆమెను ఇన్విస్టిగేట్ చేస్తుంటారు. ఈ క్రమంలో అనసూయ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి అనేది “కథనం” కథాంశం అని తీజర్ తో అర్ధమయ్యేలా చెప్పారు. మరి ఈ మర్డర్ మిస్టరీ ఎప్పుడు విడుదలవుతుందనేది చూడాలి.

Share.