కాటమరాయుడు టీజర్ | పవన్ కళ్యాణ్, శృతిహాసన్

“ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడు ఉన్నాడన్నదే ముఖ్యం” అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా తన డైలాగ్ పవర్ చూపించారు. డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్ నటిస్తున్న సినిమా కాటమరాయుడు టీజర్ ఈరోజు (శనివారం) రిలీజ్ అయింది. అర నిముషం నిడివిగల ఈ టీజర్ లో రాయుడు యాక్షన్ సీన్స్ రుచి చూపించారు. కాటమరాయుడు శత్రువులను దుమ్ముదులపడమే కాదు, తమ్ముళ్లతో సరదాగా డ్యాన్స్ కూడా చేయగలరని చెప్పారు. ఈ వీడియోకి అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదరహో అనిపించింది. యాక్షన్ తో నిండిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి.

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. పవన్ కి తమ్ముళ్లుగా అజయ్, శివబాలాజీ, కమల్ కామరాజులు నటిస్తున్నారు. తమిళం చిత్రం “వీరమ్” కి రీమేక్ అయినప్పటికీ ఆ ఛాయలు ఏమీ కనిపించకుండా డైరక్టర్ డాలీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఫ్రెష్ మూవీ లుక్ ని తీసుకొచ్చారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పై శరత్ మరార్ నిర్మించిన ఈ మూవీ  ఉగాది కానుకగా మార్చి 24 న రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.