కర్త కర్మ క్రియ

తెలుగు ప్రేక్షకులకు “బిచ్చగాడు, డి16” లాంటి సూపర్ హిట్ తమిళ చిత్రాలను అనువాదరూపంలో అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన స్ట్రయిట్ తెలుగు చిత్రం “కర్త కర్మ క్రియ”. “వీకెండ్ లవ్” ద్వారా దర్శకుడిగా పరిచయమైన నాగు గవర తన రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలను నమోదు చేసుకొంది. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందో లేదో చూడాలి. kartha-karma-kriya-movie-telugu-review1

కథ : సిద్ధు (వసంత్ సమీర్) ఓ సెల్ ఫోన్ షాప్ లో ముబైల్స్ రిపేర్ చేస్తూ, తన ఫ్రెండ్ యాదు (జబర్దస్త్ రాంప్రసాద్)తో టైమ్ పాస్ చేస్తుంటాడు. తన ఫ్రెండ్ పనిచేసే బైక్ షోరూంలో వర్క్ చేసే మైత్రీ (సెహర్)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కొన్నాళ్ల స్నేహం అనంతరం ఆమెకు తన ప్రేమ వ్యక్తపరచాలనుకొనే తరుణంలో చనిపోయిన తన అక్క దివ్య (నూతన్ రాజ్) ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని.. ఆమె చావు వెనుక కారణం వెతికే పనిలో తాను ఉన్నానని.. తనకు సహాయం చేయమని కోరుతుంది మైత్రీ.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. మైత్రీ అక్కయ్య దివ్యకి.. హీరో సిద్ధూకి ఒక చిన్న లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏమిటి? దివ్య చావు వెనుక ఉన్న కారణం ఏంటీ? అనేది సినిమా కథాంశం. kartha-karma-kriya-movie-telugu-review2

నటీనటుల పనితీరు : వసంత్ సమీర్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో పర్వాలేదనిపించుకొన్నాడు. స్క్రీన్ ప్రెజన్స్ వరకూ ఒకే కానీ.. ఎమోషన్స్ మాత్రం పండించలేకపోయాడు. సినిమాకి కీలకమైన క్లైమాక్ లో వసంత్ సమీర్ నటన వల్ల సీన్ లోని ఎమోషన్ కానీ.. ఇంటెన్సిటీ కానీ తెరపై ప్రెజంట్ అవ్వలేకపోయాయి.

సెహర్ కనిపించడానికి పద్ధతిగా, క్యూట్ గా ఉంది కానీ.. ముఖంలో హావభావాలు మాత్రం కనిపించలేదు. పైగా.. సినిమాకి చాలా కీలకమైన ఆమె పాత్ర ద్వారా ఎమోట్ అవ్వాల్సిన ఎమోషన్స్ ఏవీ వ్యక్తమవ్వలేదు.

సెకండాఫ్ లో వచ్చినా.. రవివర్మ ఒక్కడే తన పాత్రకి న్యాయం చేయడంతోపాటు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. kartha-karma-kriya-movie-telugu-review3

సాంకేతికవర్గం పనితీరు : దర్శకుడు నాగు గవర ఎంచుకొన్న కథ నేటి యువతరానికి, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నా చాలా సంఘటనలకి అద్దం పట్టినా.. సరైన కథనం లేకపోవడంతో అంత సీరియస్ ఇష్యూకి ఆడియన్స్ పెద్దగా రియాక్ట్ అవ్వడం కానీ కనెక్ట్ అవ్వడం కానీ జరగదు. పైగా.. లీడ్ పెయిర్ పెర్ఫార్మెన్స్ లు సినిమాకి మైనస్ గా నిలవడం వలన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో రేపిన ఆసక్తిని సినిమా అందుకోలేకపోయిందనే చెప్పాలి. స్క్రీన్ ప్లే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా రాసుకొని ఉంటే బాగుండేది.

శ్రవణ్ భరద్వాజ్ సంగీతం బాగుంది కానీ.. నేపధ్య సంగీతం సినిమాలోని ఎమోషన్ ను ఎలివేట్ చేయాలకపోయింది. దుర్గకిషోర్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. నిర్మాణ విలువలు ఇంకాస్త బెటర్ గా ఉండే బాగుండు అనిపిస్తుంది.kartha-karma-kriya-movie-telugu-review4

విశ్లేషణ : మంచి మూల కథ ఉన్నప్పటికీ.. సరైన ఎగ్జిక్యూషన్ & స్క్రీన్ ప్లే లేని కారణంగా ఆకట్టుకోలేని చిత్రంగా మిగిలిపోయిన చిత్రం “కర్త కర్మ క్రియ”. kartha-karma-kriya-movie-telugu-review5

రేటింగ్ : 1.5/5

Share.