తన ప్రేమలో ఉన్నట్టు కన్ఫర్మ్ చేసిన కంగనా..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా.. ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన ముక్కుసూటి తనంతోనో లేదో అమాయకత్వంతోనే వివాదాస్పదమైన కామెంట్లు చేస్తూ ఉంటుందని… నిత్యం ఎవరొకరి పై విమర్శలు కురిపిస్తూ ఉంటుందని ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఈ విషయాల్ని పక్కన పెడితే… తాజాగా ఈ బ్యూటీ లవ్ లో ఉన్నట్లు తెలిపి అందరినీ షాక్ కి గురిచేసింది. అప్పట్లో ఆదిత్య పంచోలి – హృతిక్ రోషన్ వంటి వారితో ప్రేమాయణాన్ని నడిపింది కంగనా.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా, తను ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. ఈ ఇంటర్వ్యూ లో కంగనా మాట్లాడుతూ “నా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను చవిచూశాను… ఇదే సమయంలో తన జీవితంలో ప్రేమ లేని రోజంటూ లేదు. ఇప్పుడు నా జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. నాకు స్ఫూర్తిగా నిలిచే ఒక తోడు కావాలని కోరుకుంటున్నానని చెప్పింది. 20 ఏళ్ళ వయసులో రిలేషన్ షిప్స్ పట్ల నాకు విభిన్నమైన ఆలోచనలు ఉండేవి… ఇప్పుడు చాలా స్పష్టతతో ఉన్నాను. ఇప్పుడే అసలైన ప్రేమ అనుభూతిని పొందుతున్నాను” అంటూ కంగనా చెప్పుకొచ్చింది. ఇక కంగనా ప్రస్తుతం ‘మెంటల్ హై క్యా’ అనే చిత్రంలో నటిస్తుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రాజ్ కుమార్ రావు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇక కంగనా ప్రేమలో ఉన్నానని తెలిపిందో లేదో ‘ఎవరా బాధితుడు అంటూ’ సోషల్ మీడియాలో కొందరు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Share.