మూవీ మాఫియా నా సినిమాని ఏం చేయగలిగింది: కంగనా

బాలీవుడ్ న‌టి కంగ‌న‌రౌన‌త్ ముఖ్య పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం “మణికర్ణిక”. ఈ సినిమా బుచియన్‌ ఇంటర్నేషనల్‌ ఫెంటాస్టిక్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపిక అయింది. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకోలేదని, ఇప్పుడు ఈ ఘనత సాధించడం వారికి చెంప పెట్టులాంటిదని తెలిపింది కంగ‌న‌.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఈ వార్త మమ్మల్ని థ్రిల్‌కు గురి చేసింది. “గల్లీబాయ్‌” సినిమాపై మొత్తం చిత్ర పరిశ్రమ ప్రశంసల జల్లు కురిపించింది. కానీ “మణికర్ణిక” గురించి ఒక్కరూ మాట్లాడలేదు. “మూవీ మాఫియా” నా సినిమాను చంపేయాలి అనుకుంది. కానీ ఈ సినిమా కమర్షియల్‌ హిట్‌ అందుకుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా చిత్రానికి గుర్తింపు లభించింది. ఇది “మూవీ మాఫియా”కు చెంప పెట్టులాంటిది. వాళ్లంతా కలిసి, ఎన్ని చేసినా ఓ మంచి సినిమాను ఆపలేరు. ప్రత్యేకించి సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం ఒక్కటైన ఈ కాలంలో అది సాధ్యం కాని పని అని పేర్కొంది కంగనా. ఇక ఈ సినిమా విషయంలో క్రిష్ కి ఎదురైన తిప్పల గురించి కొత్తగా ఏం చెప్పుకొంటాం చెప్పండి.

Share.