‘కణం’ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ | నాగశౌర్య | సాయిపల్లవి

ఫిదా సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచేసుకుంది సాయిపల్లవి. ఈ ‘ప్రేమమ్’ హీరోయిన్ ప్రస్తుతం నాగశౌర్యతో కలిసి కణం సినిమాలో నటిస్తోంది. హారర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్నది. తమిళ్‌లో కరు టైటిల్‌తో రిలీజ్ కానుంది. ఏఎల్ విజయ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంతో సాయిపల్లవి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తల్లీకూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో కణం తెరకెక్కుతున్నది. ఈ మూవీలో సాయిపల్లవి నాలుగేళ్ల కూతురికి తల్లి పాత్రలో నటిస్తోందట. సాయిపల్లవి, నానితో కలిసి ఎంసీఏ సినిమాలో కూడా నటిస్తోంది.

Share.