క్యూరియాసిటీ… పెంచుతున్న ‘118’ ట్రైలర్..!

గత సంవత్సరం ‘ఎం.ఎల్.ఏ’ ‘నా నువ్వే’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇందులో ‘ఎం.ఎల్.ఏ’ చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ… ‘నా నువ్వే’ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. చెప్పాలంటే కళ్యాణ్ రామ్ కి ‘పటాస్’ చిత్రం తరువాత సరైన హిట్ లేదు. గెస్ట్ రోల్ చేసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని మరో యాక్షన్ థ్రిల్లర్ కథతో రావడానికి సిద్దమయ్యాడు. ఆ చిత్రమే ‘118’. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ఫస్ట్ సింగల్ కి మంచి స్పందన లభించింది.

తాజాగా ‘118’ ట్రైలర్ ను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్లో కళ్యాణ్ రామ్ మరోసారి డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. కళ్యాణ్ రామ్ సరసన షాలిని పాండే – నివేత థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సీనియర్ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ట్రైలర్ చూస్తుంటే ఓ సస్పెన్స్ త్రిల్లర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. కళ్యాణ్ రామ్ కి ఏదో డిసార్డర్ ఉంది. కలలో కనిపించిన ఓ అమ్మాయిని(నివేథా థామస్) వెతుకుతూ కళ్యాణ్ రామ్ తిరుగుతున్నాడు. ఇది చూస్తుంటే మనకి ‘1 నేనొక్కడినే’ చిత్రంలో మహేష్ బాబు గుర్తుకు రావడం ఖాయం. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి, యాక్షన్ కూడా ఓ రేంజ్లో ఉండబోతుందని స్పష్టమవుతుంది. నిర్మాత భారీగానే ఖర్చుపెట్టాడు. షాలిని పాండే… కళ్యాణ్ రామ్ కి మధ్య మంచి రొమాన్స్ ఉంటుందని తెలుస్తుంది. ‘స్టార్ట్ చేసింది ఏదైనా సగం లో ఆపాలంటే నాకు చిన్నపట్నుంచి చెడ్డ చికాకు… ఏంటో వెధవ క్యూరియాసిటీ’ అని కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.. అలాగే మనకి కూడా ఈ చిత్రం పై క్యూరియాసిటీని పెంచుతుంది. మరి ఈ చిత్ర ఫలితం ఎలా ఉంటుందో తెలీదు కానీ… ట్రైలర్ అయితే ఓకే అనిపిస్తుంది. ఈ ట్రైలర్ ని మీరు కూడా ఒకసారి చూసెయ్యండి.

Share.