అందుకే కళ్యాణ్ దేవ్ పోలీసులని ఆశ్రయించాడు..?

‘విజేత’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ఇప్పుడు పులి వాసు డైరెక్షన్లో తన రెండవ చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి సమయంలో అనుకోని రీతిగా తన ఇన్స్టాగ్రామ్లో కొందరు నెటిజన్లు అసభ్యకరమైన పోస్ట్ లు, కామెంట్లు పెట్టడంతో అతడు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కొందరు ఆకతాయిలు ఇన్స్టాగ్రామ్ లో కళ్యాణ్ దేవ్ పై కొన్ని అసభ్యకర కామెంట్స్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. కళ్యాణ్ దేవ్ కుటుంబం పై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణలు చేసాడాయన.

దీంతో ఈ విషయం పై స్పందించిన అదనపు డీసీపీ రఘువీర్.. హీరోని వేధిస్తున్న పది మందిని గుర్తించినట్లు చెప్పుకొచ్చాడు. నిందితుల అకౌంట్ల వివరాల కోసం ఇన్స్టాగ్రామ్ కు లేఖ రాశామని.. ఇన్స్టాగ్రామ్ నుండీ వివరాలు అందగానే చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చాడు. రాను.. రాను ఇలా సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ప్రవర్తన మరీ హద్దులు మీరిపోతుందని ఈ సంఘటనతో మరోసారి నిజమైంది.

Share.