ఈ ఏడాది కూడా కాజల్ ఫుల్ బిజీ

ముంబై బ్యూటీ కాజల్ అగర్వాల్ తన నటనతో తెలుగు ఇంటి ఆడపడుచు అయింది. లక్ష్మి కళ్యాణం సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. అనేక మంచి పాత్రలు పోషించి టాలీవుడ్ యువరాణిగా పేరుతెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ విజయాలను అందుకుంది. గత సంవత్సరం ఖైదీ నంబర్ 150 , నేనే రాజు నేనే మంత్రి విజయాలను సొంతంచేసుకుంది. తమిళంలో ఆమె నటించిన మెర్సెల్ కూడా సూపర్ హిట్ అయింది. నేటి కాలంలో ఐదేళ్లకే హీరోయిన్స్ బోర్ కొట్టేస్తున్నారు. అటువంటిది పదమూడేళ్లుగా కథానాయికగా కాజల్ చిత్రాలను చేస్తోంది. ఈ ఏడాది కూడా ఆమె బిజీగా ఉంది.

ప్రస్తుతం తన తొలి హీరో క‌ల్యాణ్‌రామ్‌తో ఎమ్ఎల్ఏ (మంచి ల‌క్షణాలున్న అబ్బాయి) సినిమా చేస్తోంది. త‌మిళ “క్వీన్‌” రీమేక్‌లోనూ న‌టిస్తోంది. దీని త‌ర్వాత సుధీర్ వ‌ర్మ‌, శ‌ర్వానంద్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాలోనూ అవకాశం అందుకుంది. వీటితో పాటు తనని తెలుగు తెరకు పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో మూడో సినిమా చేయబోతోంది. వెంక‌టేష్‌, తేజ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాకు సంతకం చేసినట్లు తెలిసింది. సో ఈ ఏడాది ఆమె నటించిన నాలుగు చిత్రాలు థియేటర్లో సందడి చేయనున్నాయి. ఇవి హిట్ అయితే మరో రెండేళ్లు పరిశ్రమలో కాజల్ కొనసాగడం ఖాయం.

Share.