కాజల్ సినిమాల లిస్ట్ చూసి కలవరపడుతున్న కాజలిస్ట్స్

గత కొన్నేళ్లుగా అగ్ర కథానాయిక హోదాను ఎంజాయ్ చేస్తూ.. మొన్నామధ్య కాస్త లో ఫేజ్ ఫేస్ చేసినప్పటికీ.. మళ్ళీ వరుస భారీ చిత్రాలతో కెరీర్ ను పరిగెట్టించిన కాజల్ అగర్వాల్ కెరీర్ మళ్ళీ స్లో అవుతోంది. ప్రస్తుతం తెలుగులో ఆమె ఒక్క అగ్ర కథానాయకుడి సినిమాలోని క్యాస్ట్ అవ్వలేదు. అలాగే.. తమిళంలో కూడా ఎలాంటి భారీ సినిమాను దక్కించుకోలేకపోయింది కాజల్. బెల్లంకొండ శ్రీనివాస్ తో మాత్రం రెండు సినిమాలు చేస్తోంది. “కవచం” రేపు విడుదలవుతుండగా.. తేజ దర్శకత్వంలో నటించిన మరో చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు.

ఇప్పుడేమో శంకర్ దర్శకత్వంలో “ఇండియన్ 2” సైన్ చేసింది. ఈ సినిమా 2020కి గానీ రిలీజ్ అవ్వదు. మరి ఈలోపు కాజల్ అగర్వాల్ మరో సినిమా సైన్ చేస్తుందా లేక ఈ మూడు సినిమాలతోనే నెట్టుకొస్తుందా అని కంగారు పడుతున్నారు కాజల్ ఫ్యాన్స్. అలాగే.. కాజల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తానో మానసిక మరియు శారీరిక రుగ్మతితో బాధపడుతున్నానని పేర్కొనడం చర్చనీయాంశం అయ్యింది. అసలే సరైన సినిమా పడలేదని కంగారుపడుతున్న కాజల్ అభిమానులందరూ.. ఇప్పుడు ఈ కొత్త టెన్షన్ యాడ్ అవ్వడంతో ఏం చేయాలో తోచని కంగారులో కొట్టుమిట్టాడుతున్నారు.

Share.