జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో రాజకీయ రణరంగం

రాజకీయం అనేది ఎన్టీఆర్ కు కొత్త కాదు. తాతయ్య, తండ్రి పుణ్యమా అని రక్తంలో రాజకీయం ఉంది జూనియర్ కి. 2009 ఎలక్షన్స్ లోనే టిడిపి తరుపున రంగంలోకి దిగి ప్రచారం చేశాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా బెడ్ మీద నుంచే ప్రచారం కొనసాగించాడు. అంతటి ఘనమైన ఫ్లాష్ బ్యాక్ ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు పాలిటిక్స్ అనేసరికి జంకుతున్నాడు. అందుకు కారణం ఆయన సొంత కుటుంబంలోనే రెండు రాజకీయ పార్టీలు పుట్టుకొస్తుండడం.

ఎన్టీఆర్ కు స్వయానా మావయ్య అయిన నార్నే శ్రీనివాసరీవు ఇటీవల వై.ఎస్.జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. కలిసింది క్యాజువల్ గానే అయినప్పటికీ.. నార్నే త్వరలోనే వై.ఎస్.ఆర్.సి.పిలో జాయినవ్వనున్నాడని టాక్ మాత్రం గట్టిగా స్ప్రెడ్ అయ్యింది. దాంతో.. ఎన్టీఆర్ తన మావయ్యతో మాట్లాడడం లేదని తెలుస్తోంది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అనే నగ్న సత్యాన్ని జ్ణప్తికి తెచ్చుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు ఆయనతో క్లోజ్ గా ఉంటే తాను కూడా ఎక్కడ వై.ఎస్.ఆర్.సి.పి కి సపోర్ట్ చేస్తున్నా అనుకొంటారో అని ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకొన్నాడు ఎన్టీఆర్. మరి ఈ పరిస్థితిలో ఎప్పటికీ క్లారిటీ వస్తుందో చూడాలి.

Share.