నాని బ్రదర్… నువ్వు కొట్టిన బంతి స్టేడియం దాటేసింది : ఎన్టీఆర్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్ 19 న (ఈరోజు) విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో నాని నటనకి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన విధానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసాడు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన తారక్ ఈ చిత్రం అద్భుతమంటున్నాడు. ఇక నాని యాక్టింగ్ ను అయితే ఆకాశానికి ఎత్తేసాడు.

jr-ntr-comments-on-jersey-movie1ఎన్టీఆర్ తన ట్విట్టర్లో ‘జెర్సీ’ చిత్రం పై స్పందిస్తూ… ” ‘జెర్సీ’ చిత్రం ఓ అద్భుతమైన జర్నీ. గౌతమ్ తినన్నూరి డైరెక్షన్ కు నిజంగా హ్యాట్సాఫ్. తను ఈ కథను నమ్మి ఎంతో శ్రద్దగా తెరకెక్కించాడు. గౌతమ్ విజన్ కు సపోర్ట్ చేసిన నటీనటులందరికీ నా అభినందనలు. నాని బ్రదర్… నువ్వు కొట్టిన బంతి స్టేడియం దాటేసింది. నిజంగా ‘బ్రిలియన్ట్ బ్రిలియన్ట్ బ్రిలియన్ట్’ పెర్ఫార్మన్స్. నీ కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాత్ర. దీనికి నువ్వు పూర్తిగా న్యాయం చేసావ్. ‘జెర్సీ’ నీకే కాదు అందరూ గర్వపడే చిత్రం.” అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు.

Share.