జోగేంద్ర థీమ్ సాంగ్ | నేనే రాజు నేనే మంత్రి | రానా, కాజ‌ల్

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నేనే రాజు నేనే మంత్రి”. సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. రాణా టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో కాజల్, కేథరీన్ లు  కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం 24 గంటల్లోపే 4 మిలియన్ వ్యూస్ సాధించి సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచింది.

చిత్ర దర్శకులు తేజ మాట్లాడుతూ.. “రాణాలోని సరికొత్త యాంగిల్ ను “నేనే రాజు నేనే మంత్రి”లో చూస్తారు. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ చిత్రంలో రాణా యాటిట్యూడ్ ఉంటుంది. జోగేంద్ర పాత్రలో రాణా ఒదిగిపోయిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది” అన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.