రెండో సినిమాకే సూపర్ రోల్ దక్కించుకున్న జాన్వి కపూర్!

ఈమధ్యకాలంలో సినిమాలో హీరోయిన్స్ కి హీరో కాంబినేషన్ లో సాంగ్స్ తప్ప సీన్స్ ఉండడమే తక్కువైపోయింది. అలాంటిది తన రెండో సినిమాకే ఓ అద్భుతమైన పాత్ర దక్కించుకొంది అది కూడా 1999లో జరిగిన కార్గిల్ వార్ లో పాల్గొని తన సాహసాలతో సంచలనాలు సృష్టించిన గుంజన్ సక్సేనా అనే మహిళా పైలెట్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కెబోతోంది. డైరెక్షన్ ఎవరు చేస్తారు, ఎవరు నిర్మిస్తారు అనేది ఇంకా ఫిక్స్ అవ్వకపోయినప్పటికీ.. కార్గిల్ వార్ నేపధ్యంలో రూపొందబోయే సినిమా కావడంతో ప్రీప్రొడక్షన్ కి ముందే ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా.. నేటితరం హీరోయిన్స్ లాగ కమర్షియల్ సినిమాలు కాకుండా ఇలా ఆఫ్ బీట్ సినిమాలు సెలక్ట్ చేసుకుంటున్నందుకు జాన్వికపూర్ ని కూడా తెగ పొగిడేస్తున్నారు బాలీవుడ్ వర్గాలు.

ఇకపోతే.. “ఆర్ ఆర్ ఆర్” చిత్రంలోనూ జాన్వికపూర్ కథానాయికగా నటిస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ, జాన్వి కమిట్ మెంట్స్ ను బట్టి అది జస్ట్ గాసిప్ అని తేలిపోయింది. సో, జాన్వి కపూర్ బాలీవుడ్ కు మాత్రమే అంకితం అని అర్ధమవుతోంది.

Share.