జ‌య జాన‌కి నాయ‌క‌ మూవీ టీజర్ | బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ | రకుల్‌ప్రీత్‌సింగ్‌

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం జయ జానకి నాయక. బోయపాటి శ్రీను దర్శకుడు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిశ్రీనివాస్‌ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌ నాయికగా నటిస్తోంది. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదలచేశారు. బోయపాటి సినిమా తరహా మాస్‌తరహా కోణం ఎక్కడా కనిపించకుండా చాలా క్యూట్‌గా ఉన్న ఫస్ట్‌లుక్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారని, అయితే ఆ లోటును తీర్చేందుకు సినిమాలో మాస్‌ లుక్‌తో ఉన్న సాయిశ్రీనివాస్‌ క్యారెక్టర్‌ పోస్టర్‌ను విడుదల చేసినట్లు చిత్రబృందం తెలియజేసింది.

ఒక పాట మినహా చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. కుటుంబ ప్రేక్షకులు అందరూ కలిసి చూడదగ్గ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరింపజేస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.