“జవాన్” మూవీ థియేట్రికల్ ట్రైలర్ | సాయి ధరమ్ తేజ్ | మెహ్రీన్ ఫిర్జాదా

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా , బివిఎస్ రవి దర్శకత్వం చేసిన చిత్రం జవాన్. ఈ చిత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్ గా చేస్తుంది.  దేశానికే కాదు ప్ర‌తి ఇంటికి కూడా జ‌వాన్ వుంటాడు, వుండాలి కూడా.. దేశాన్ని ప్రాణంగా , భాద్య‌త‌గా భావించి అహ‌ర్నిశ‌లు ర‌క్ష‌ణ క‌ల్పిస్తాడు ఆ జ‌వాన్‌… దేశంలోని త‌న ఇంటిని ఇంటిలో వారిని త‌న గుండెల్లో పెట్టుకుని భాద్య‌త‌తో కాపాడుకుంటాడు ఈ జ‌వాన్‌. అనే కాన్స్‌ప్ట్ తో సిధ్ధ‌మైంది ఈ చిత్రం.  ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌ల చేసిన‌ ప్ర‌తి ప్ర‌మెష‌న‌ల్ మెటిరియ‌ల్ కి చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం యూనిట్ లో నూత‌నుత్సాహ‌న్ని క‌లిగించింది. సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ నుండి ట్రెమండ‌స్ స‌క్స‌స్ కోసం ఎదురుచూస్తున్న మెగాఅభిమానుల అంచ‌నాలు ఈ చిత్రం అందుకుంటుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా నిర్మాత‌లు గ్రాండ్ గా రిలీజ్  రిలీజ్ చేస్తున్నారు.

Share.